బసవతారకం ఆస్పత్రిలో ‘యాక్ట్‌’ క్లినిక్‌

హైదరాబాద్‌ సిటీ: కేన్సర్‌ వ్యాధిని జయించిన సర్వైవర్స్‌ మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోకుండా జీవితాన్ని సాఫీగా గడపడానికి యాక్ట్‌ (ఆఫ్టర్‌ కాంప్లిషన్‌ ఆఫ్‌ థెరపీ) క్లినిక్‌ను బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటర్నేషనల్‌ చైల్డ్‌ హుడ్‌ కేన్సర్‌ డే సందర్భంగా శుక్రవారం ఇండియన్‌ కేన్సర్‌ సొసైటీ జాయింట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ పూర్ణ కుర్కురే ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం కారణంగా ఇప్పుడు కేన్సర్‌ను జయించిన వారి సంఖ్య పెరుగుతున్నదన్నారు. ఆస్పత్రి సీఈవో డాక్టర్‌ కె.కఅష్ణయ్య మాట్లాడుతూ చికిత్స పూర్తి అయిన తర్వాత సాధారణ జీవనాన్ని సాగించడానికి అవసరమైన సలహాలు, సూచనలు, ఇతరత్రా ఇబ్బందులను దూరం చేయడానికి ఈ క్లినిక్‌ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ వైద్యులు ఎంవీటీ కఅష్ణమోహన్‌, డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప, కల్పనా రఘునాథ్‌, వీరేంద్ర పాటిల్‌, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

➡️