బీఆర్‌ఎస్‌ కి బిగ్‌ షాక్‌.. ఆ భూమిపై పిటీషన్‌

Jan 14,2024 14:53 #judgement, #telangana high court

హైదరాబాద్‌: కోకాపేటలో బీఆర్‌ఎస్‌కి 11 ఎకరాల భూమిని కేటాయించాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ మండలం కోకాపేట్‌ గ్రామంలోని నం. 239, 240 బీఆర్‌ఎస్‌ కి 11 ఎకరాల భూమి కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత న్యాయబద్ధత జరగలేదని లాయర్‌ వెంకటరామి రెడ్డి పిటీషన్‌ దాఖలు చేశారు. ప్రామాణిక టెండర్‌ ప్రక్రియను అనుసరించకుండా భూకేటాయింపుకు సంబంధించిన ప్రక్రియలను బహిరంగంగా వెల్లడించకుండా కేటాయింపులు జరిగాయని వాదించారు. ఈ భూమి మార్కెట్‌ విలువ రూ. 50 కోట్లకు పై మాటేగా ఉందని, కానీ రూ.3 కోట్ల 41 లక్షల 25 వేలకు మాత్రమే గులాబీ పార్టీకి అప్పగించారని న్యాయవాది వాదించారు. ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కూడా హైకోర్టులో ఇదే విధమైన పిటీషన్‌ దాఖలు చేసింది. కేసు తీర్పు పెండింగ్‌లో ఉంది. ఎన్జీవో దాఖలు చేసిన పిల్‌పై స్పందిస్తూ, కోర్టు ప్రభుత్వానికి నోటీసులు పంపింది.

➡️