భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదుల దీక్షలు

Feb 24,2024 08:25 #deekshalu, #lawyers

– మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సిపిఎం

ప్రజాశక్తి-గుంటూరు: కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తెచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలు శుక్రవారంనాటికి 52వ రోజుకు చేరాయి. గుంటూరు బార్‌ అసోసియేషన్‌, ఆల్‌ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 52 రోజులుగా న్యాయవాదులు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. భూములకు సంబంధించిన కేసులు న్యాయస్థానాలతో సంబంధం లేకుండా రెవెన్యూ వ్యవస్థకు సర్వాధికారాలు కట్టబెట్టడం తగదన్నారు. ఈ చట్టం వల్ల పేదలు, రైతులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను కారుచౌకగా అభివఅద్ధి పేరుతో పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని, దీనిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు నర్రా శ్రీనివాస్‌, ఉమేష్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️