మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట

అమరావతి: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. కుల ధ్రువపత్రాన్ని ఈ నెల 4న జీవో నంబర్‌ 2 ద్వారా ప్రభుత్వం రద్దు చేయడంతో గీత హైకోర్టును ఆశ్రయించారు. 2016లో తన కులాన్ని ఎస్టీగా కలెక్టర్‌ నిర్ధరించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.

➡️