మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్.. పాప వినాశనం అనుమతి నిలిపివేత

Dec 4,2023 15:27 #tirumala tirupathi temple
  • తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం

ప్రజాశక్తి తిరుమల : తిరుమలలో మిచౌంగ్ ప్రభావం కనిపిస్తోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్రమైన చలి, భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో.. పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో.. సిబ్బంది వాటిని తొలగించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేస్తున్నారు. దిగువ ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి కాలువలోకి వెళ్ళింది. భక్తులు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.అక్కగార్ల గుడి వద్ద వాటర్ ఫాల్స్ లో భక్తులు తడిచి ఎంజాయ్ చేస్తున్నారు

➡️