ముద్రగడను కలిసిన జ్యోతుల నెహ్రూ

Jan 11,2024 11:26 #Jyotula Nehru, #Kakinada, #Mudragada

ప్రజాశక్తి-కాకినాడ : టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముద్రగడను కిర్లంపూడిలోని తన నివాసంలో కలిశారు. ఇర్రిపాకలో జరిగే మహా కుంభాభిషేకానికి ఆహ్వానం తెలిపేందుకే వచ్చానని జ్యోతుల నెహ్రూ తెలిపారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తున్న తరుణంలో తనకు మద్దతు తెలపాలని ముద్రగడం కోరానని నెహ్రూ అన్నారు. అందుకు ముద్రగడ పద్మనాభం వ్యక్తిగతంగా తనకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతాన్నరని తెలిపారు. నిన్న జనసేన నాయకులు కలవడం, ఈరోజు జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలవడంతో ఈ భేటి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

➡️