మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళా కానిస్టుబుల్‌ ఆందోళన

Jan 31,2024 15:25 #andholana, #women conistable

హైదరాబాద్‌ : తన భర్త వరుణ్‌ పై ల్యాండ్‌ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికెట్‌ సఅష్టించి రిమాండ్‌ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ ముందు హైదరాబాద్‌ కమిషనరేట్‌ కానిస్టేబుల్‌ నాగమణి ఆందోళన చేపట్టారు. మేడిపల్లి ఎస్‌ఐ శివకుమార్‌ పై గతంలో డీసీపీ, సీపీకి కంప్లైంట్‌ చేయడంతో తమపై కక్ష్య సాధింపు చర్యలు తీసుకుంటున్నాడని ఆందోళనకు దిగారు.’మా పిటిషన్‌ను పరిశీలించ కుండా మాపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని నాగమణి అవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ శివకుమార్‌ చేసిన అవినీతి, తీసుకున్న లంచాల పై తన వద్ద ఆధారాలు ఉన్నాయని కానిస్టేబుల్‌ నాగమణి తెలిపారు.

➡️