యాచకులపై కత్తులతో దాడి – ఒకరు మృతి

Jan 29,2024 11:29 #attack, #beggars, #killed, #Knife, #one, #Telangana

తెలంగాణ : సికింద్రాబాద్‌ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో యాచకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. మోండా మార్కెట్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ యాచకుడిపై ముగ్గురు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. మారేడ్‌పల్లిలో నడిచి వెళుతున్న మరో వ్యక్తిపైనా దాడి చేశారు. తీవ్రగాయాలైన అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

➡️