రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి : జస్టిస్‌ ఎన్వీ రమణ

Mar 28,2024 17:10 #press meet, #Retd CJ NV Ramana

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ నేరస్థులుగా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. కఅష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జస్టిస్‌ ఎన్వీరమణకు అమరావతి రైతులు, మహిళలు, నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడారు. దాదాపు 1563 రోజులుగా అమరావతి రైతులు దీర్ఘకాలంగా ఉద్యమాలు చేయడం దక్షిణాధి రాష్ట్రంలో మొట్టమొదటిదని పేర్కొన్నారు. ‘ రైతులు రాజధాని కోసం తమ భూములు త్యాగం చేశారు. రైతుకు, భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డలకు ఉన్న సంబంధంలాంటిదని ‘ పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో భూములు కోల్పోవడం సామాన్య విషయం కాదని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కని న్యాయం చేస్తారని, ఆలస్యంగానైనా న్యాయవ్యవస్థలో రైతులకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యయం విజయవంతం కావాలని, విజయవాడలో మంచి రాజధాని నిర్మాణం జరగాలని, రైతుల ఆందోళనకు తగిన ఫలితం లభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️