‘హోదా’ మాట తప్పిన మోడీ..కేడినే

Jan 29,2024 07:43 #speech, #ys sharmila

-బిజెపి కేడీల పార్టీ- మద్దతిచ్చిన బాబూ, జగన్‌ అన్నా కేడీలే

– తిరుపతి సభలో షర్మిల

తిరుపతి :తిరుపతిలో ఆదివారం నిర్వహించిన సభలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల బిజెపిపై నిప్పులు చెరిగారు. ఇదే తిరుపతిలో నిలబడి మోడీ గారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోని మోడీ కేడీనే అవుతారని, బిజెపి కేడీల పార్టీ అని ఆమె విమర్శించారు. దానికి మద్దతు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్‌ కూడా కేడీలు కారా అని ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా ఇస్తామని ఇదే తిరుపతిలో మోడీ చెప్పారు. ఇచ్చిన మాట ఏమయ్యింది? మాట నిలబెట్టుకోని మీరు మోడీ అవుతారా? కేడి అవుతారా? మాట నిలబెట్టుకోని మీరు కేడినే అవుతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ చేసింది పాపం.. అన్యాయం. బిజెపి కేడిల పార్టీ..కేడి పార్టీకి మద్దతు తెలిపిన బాబు, జగన్‌ అన్న కూడా కేడిలు కారా..? జగన్‌, బాబు ఆలిబాబా అరడజన్‌ దొంగలు ఇది పరిస్థితి’ అని ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

➡️