రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి

నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సామాన్యుడు

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఓ సామాన్యుడు ఆదివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కూసంపూడి విజరు అనే వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బివిఆర్‌ కళా కేంద్రం వద్ద గుండు కొట్టించుకుని, అక్కడే స్నానం చేసి గాంధీ వేషధారణతో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, వ్యాపారులు, పలు సంఘాల నుంచి మద్దతు లభిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం కోసం నేటి నుంచే నిరవధిక నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు. తనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్టా నాగరాజు, నేధురి గంగాధర్‌, చిన్నా పాల్గొన్నారు.

➡️