లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు

Jan 11,2024 12:37 #join tdp, #Nara Lokesh, #YCP Leaders

ప్రజాశక్తి-అమరావతి : కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్‌ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ కైపా పద్మాలతారెడ్డి, కేవీ.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ అధినేత సుబ్బారెడ్డి, ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ అధినేత కైపా అశోక్‌ కుమార్‌ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నారా లోకేష్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జిల్లాలో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని లోకేష్‌ సూచించారు. టీడీపీతోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమని, వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఒనగూరింది ఏమీ లేదని పార్టీలో చేరిన సుబ్బారెడ్డి, పద్మాలతారెడ్డి, అశోక్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కర్నూలుకు వచ్చిన పరిశ్రమలు ప్రభుత్వ వేధింపులతో పరారయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్‌, ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️