వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవడం ఖాయం : పెద్దిరెడ్డి

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలవడం ఖాయం అనిమంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అంటూ ఆయన కొనియాడారు. మ్యానిఫెస్టోతో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం.. చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నాడు.. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వెల్లడించారు.

ఏదో రకంగా అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాకులాడుతున్నాడన్నారు. రాజకీయం చేయలేని స్థితిలో ఉత కర్రల కోసం జనసేన- బీజేపీలతో దోస్తీ కట్టాడు అంటూ ఆరోపించారు. పనికి మాలిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా.. రాష్ట్రంలో మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వం మే అని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు.

➡️