వివాహిత ఆత్మహత్య.. భర్తను హత్య చేసిన బంధువులు

Jan 13,2024 16:02 #crime

అచ్చంపేట: కుటుంబ కలహాలు కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా ఆమె భర్తను హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సింధు (26)కు అచ్చంపేటలో శ్రీరామ్‌ సరియన్‌ హాస్పిటల్లో పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నాగార్జున (30)తో పరిచయం ఏర్పడింది. మూడు సంవత్సరాల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అచ్చంపేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం పాటు సవ్యంగా సాగిన వీరి వైవాహిక జీవితంలో గొడవలు ఆరంభం అయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సింధు తమ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను అచ్చంపేట పట్టణంలోని శ్రీరామ్‌ సర్యం ఆసుపత్రిలో డాక్టర్‌ కఅష్ణ సిపిఆర్‌ ప్రథమ చికిత్స చేశారని, తదుపరి పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్‌ కర్నూల్‌ ఆస్పత్రికి తరలించడంతో మరింత విషమంగా ఉంది అని వైద్యులు చెప్పారు. అక్కడ నుండి హైదరాబాద్‌ కు తరలించారు. ఈ క్రమంలో తీసుకెళ్తూ ఉండగా మార్గమధ్యలో సింధు మరణించింది. సింధు మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు భర్త నాగార్జునను ఒక వాహనంలో అతన్ని అదుపులోకి తీసుకొని, వాహనంలోనే చితకబాడంతో రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ సమీపంలో మఅతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కాగా తమ కూతురు ఆత్మహత్యకు గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జునకు అండగా నిలిచిన డాక్టర్‌ కఅష్ణ, అతనీ భార్య కారణము అని మఅతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.

➡️