విశాఖ కొమ్మాది కూడలిలో ఢీకొన్న ఐదు వాహనాలు

Dec 27,2023 10:33 #road accident, #visakhapatnam

ప్రజాశక్తి-విశాఖ: విశాఖ కొమ్మాది కూడలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

➡️