వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

Jan 9,2024 15:50 #complaint, #TDP

అమరావతి: టీడీపీ తరఫున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేయనుంది. ఈ వ్యవహారంపై బుధవారం శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు అందించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌, మద్దాల గిరిపై టీడీపీ అనర్హత పిటిషన్‌ దాఖలు చేయనుంది. ఇప్పటికే వైసీపీలో సస్పెండ్‌ అయి టీడీపీలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ కూడా ఫిర్యాదు చేస్తుండటంతో అనర్హత రాజకీయం రసవత్తరంగా మారింది.

➡️