శిలాఫలకంపై స్థానిక ఎంపీ పేరు లేదు : మాలోతు కవిత

Mar 8,2024 16:55 #local MP's name, #the plaque

ములుగు : ములుగు జిల్లా జకారంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో సమ్మక్క – సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రోటోకాల్‌ మరిచింది. ప్రారంభ శిలాఫలకంలో మహబూబాబాద్‌ ఎంపీ కవిత పేరును మరిచారు. శిలాఫలకంపై స్థానిక ఎంపీగా తన పేరు లేకపోవడంపై మాలోతు కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ములుగు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతితో పాటు ములుగు జడ్పీటీసీ, ఎంపీలలకు కూడా చేదు అనుభవం ఎదురైంది. వారి పేర్లు కూడా శిలాఫలకంపై లేవు. దీంతో అధికారులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ధనసరి అనసూయతో పాటు జిల్లా అధికారుల పేర్లు మాత్రమే శిలాఫలకంపై ఉన్నాయి.

➡️