సామాజిక మార్పుకోసం సీఎం జగన్‌ సీట్లు మార్చుతున్నారు : గోరంట్ల మాధవ్‌

Jan 4,2024 16:45 #gorantla madhav, #press meet

అమరావతి: సామాజిక మార్పుకోసం జగన్‌ సీట్లు మార్చుతున్నారని వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దీనికి టీడీపీ మీడియా హడావుడి ఎందుకు అని ప్రశ్నించారు.”నాకు పార్టీ కన్న తల్లి లాంటిది. సజ్జలను తాను నిలదీసినట్లు ప్రచారం సరికాదు. కుటుంబాలు, తల్లిదండ్రులు, భార్య భర్తల మధ్య గొడవలు పెడుతున్నారు. శవాల మీద పేలాలు ఎరుకోవటం టీడీపీకే సాధ్యం. వార్తలు ఇచ్చే ముందు మా వివరణ తీసుకోండి. సీఎం క్యాంప్‌ ఆఫీసు మాకు ఇల్లు లాంటిది. పార్టీకి కట్టుబడి ఉంటా…పార్టీ నిర్ణయం శిరోధార్యం.” అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు.

➡️