సిపిఎం సీనియర్‌ నేత వల్లభనేని కృష్ణమూర్తి కన్నుమూత

Mar 24,2024 21:30 #cpm leader, #passed away

ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల జిల్లా) :సిపిఎం సీనియర్‌ నాయకులు, విశ్రాంత వైద్యులు వల్లభనేని కృష్ణమూర్తి (81) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని ఆయన కుమారుడి నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కృష్ణా జిల్లా మొవ్వ పంచాయతీకి చెందిన కృష్ణమూర్తి హోమియో వైద్యులు. 1972లో బదిలీపై కొల్లూరు వచ్చారు. సమీపంలోని ఆముదాల్లంక గ్రామంలో నివాసముంటున్నారు. అక్కడ వైద్యునిగా సేవలందిస్తూనే సిపిఎం భావాలతో ముందుకు సాగారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక ఉద్యమాల్లో పాల్గోన్నారు. జోలపాలెం నివేశనా స్థలాల పంపిణీ, రాగిలంక భూముల పోరాటంలో కీలక పాత్ర పోషించారు. రావిలంక భూముల పోరాట కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ఎంతో నిబద్ధత కలిగిన నాయకులుగా ఉన్న కృష్ణమూర్తి కొల్లూరు, తదితర ప్రాంతాల్లో వైద్యులుగా కూడా గుర్తింపు పొందారు. కరోనా సమయంలో బాధితులకు వైద్య చికిత్స అందించి.. ఎనలేని కఅషి చేశారు. కృష్ణమూర్తి అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరుగుతాయని సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య తెలిపారు. కృష్ణమూర్తి మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. ఆయన సేవలను జ్ఞప్తికి తెచ్చారు.

➡️