సీఎం జగన్‌ పంచ్‌లకు నాగబాబు కౌంటర్‌..

Feb 19,2024 16:00 #ap cm jagan, #nagababu, #Tweet

 ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ ప్రసంగాలు.. సినిమా డైలాగ్‌లు, పంచ్‌లు, ప్రాసలతో కాక రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు కుర్చీ మడతపెట్టేస్తారని జగన్‌ పై ఫైర్‌ అయ్యారు. జగన్‌ కూడా షర్ట్‌ మడతేస్తారని కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సైకిల్‌ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్‌ లోనే ఉండాలి, కానీ ఇంట్లో ఎప్పుడూ ఫ్యాన్‌ తిరుగుతూనే ఉండాలని అన్నారు. టీడీపీ, జనసేన ఎన్నికల చిహ్నాలపై సెటైరికల్‌ గా జగన్‌ వేసిన పంచ్‌లు వేశారు. జగన్‌ సెటైర్‌ పై సోమవారం జనసేన నేత నాగబాబు స్పందించారు. గ్లాస్‌ సింక్‌లో ఉన్నా.. తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుందని పేర్కొన్నారు. కానీ, ఫ్యాన్‌ రెక్కలు విరిగితే మాత్రం విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వలేదు అని సెటైర్లు వేశారు. అయినా.. పబ్లిక్‌ మీటింగ్‌లలో ప్రాసలు, పంచ్‌లపై పెట్టిన శ్రద్ధ సగం ప్రజా పాలనపై పెట్టాల్సిందని ఎక్స్‌ వేదికపై ట్వీట్‌ చేశారు.

➡️