సీజ్‌ చేసిన కారు రిలీజ్‌కు లంచం

Dec 20,2023 09:22 #ACB Raids, #Ongole

– ఎసిబికి చిక్కిన ఒంగోలు సెబ్‌ సిసి

ప్రజాశక్తి- ఒంగోలు: సీజ్‌ చేసిన కారును విడిచిపెట్టేందుకు లంచం అడిగిన సెబ్‌ అధికారిని ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల వివరాల మేరకు.. ఓ కేసులో సీజ్‌ చేసిన కారును విడిచిపెట్టేందుకు ఒంగోలు సెబ్‌ కార్యాలయంలో క్యాంపు క్లర్క్‌గా (సిసి) విధులు నిర్వహిస్తున్న ఫరూక్‌ అహ్మద్‌ రూ. 15వేలు లంచం డిమాండ్‌ చేశారు. కారుకు సంబంధించిన వ్యక్తి తొలుత రూ. ఎనిమిది వేలు ఇచ్చాడు. కారు రిలీజ్‌ చేయమని అడగ్గా మిగిలిన రూ. ఏడు వేలు ఇవ్వాలని ఫరూక్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో విసిగిపోయిన సదరు వ్యక్తి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు రూ.ఏడు వేలు తెచ్చి ఫరూక్‌ అహ్మద్‌కు ఇస్తుండగా ఎస్‌సిబి డిఎస్‌పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

➡️