హైదరాబాద్‌లోని పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు వెలిశాయి. దీంతో స్టాక్‌ ఉన్న పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారుల రద్దీ పెరిగింది. స్టాక్‌ లేదంటూ పలు పెట్రోల్‌ బంకులను వాటి యాజమాన్యాలు క్లోజ్‌ చేశాయి. పెట్రోల్‌ ట్యాంకర్‌ యజమానుల సమ్మె కారణంగా ఈ సమస్య ఏర్పడింది. కమిషన్‌ పెంచాలంటూ రేపటి నుంచి ట్యాంకర్‌ యజమానులు సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల వద్ద రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

➡️