మిమ్స్ ఉద్యోగుల 24 గంటల ధర్నా ప్రారంభం

24-hour dharna of MIMS employees begins
  • సమస్యలు పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా 
    మిమ్స్ యాజమాన్యం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదు
    మద్దతు తెలిపిన కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్దనున్న మిమ్స్ ఆసుపత్రిలో వనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట 24 గంటలు ధర్నా సోమవారం ప్రారంభమైంది. దీక్షలను ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణలు మాట్లాడుతూ 19 రోజులుగా మిమ్సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నా యాజమాన్యం సమస్యలు పరిష్కారం కోసం ముందుగా రాకపోవడం దారుణమన్నారు.
2003లో మిమ్స్ హస్పటల్ స్థాపించబడినది. అప్పటి నుండి కార్మికులు పనిచేస్తున్నారు. 2011లో మిమ్స్ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబందంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2020 కోవిడ్ కాలంలో యూనియన్ని బైపాస్ చేసి 15మంది కార్మికులను తొలగించి యూనియన్ లేకుండా చేసిందన్నారు. అప్పటివరకు ప్రతిరెండు సంవత్సరాలకొకసారి వేతన ఒప్పందం, ప్రతి 6నెలలకు కరువు భత్యం చెల్లించేవారు కార్మికులు పలుమార్లు సమస్యలు పరిష్కరించాలని కోరినా యాజమాన్యం అంగీకరించలేదన్నారు. కార్మికులు సమస్యలు చెప్పుకోడానికి సిఐటియు కార్యాలయానికి వెళ్లారనే వంకతో ఇద్దరు కార్మికులను యాజమాన్యం తొలగించిందన్నారు. మిగిలిన కార్మికులు కూడా బయటకు నెట్టివేయబడ్డారు. యూనియన్ లేకుండా చట్టవ్యతిరేకంగా యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. ఈ నెల కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. 7వ తేదిన విజయనగరం డిసిఎల్ వద్ద జరిగిన చర్చల్లో సమస్యలపై మాట్లాడకుండా యూనియన్ ఉండకూడదని చట్టవ్యతిరేకంగా యాజమాన్యం మొండిగా వ్యవహరించిందన్నారు. ఈ విషయంపై కలెక్టర్ జోక్యం చేసుకొని ఉద్యోగులు, యూనియన్తో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామాన్నారు. ఉద్యోగులపై వేదింపులు, కక్షసాదింపులు, బెదిరింపులు ఆపాలన్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఉద్యోగులను చిన్న చిన్న కారణాలతో విచారణ లేకుండా జరీమానాలు వేయడం చట్టవ్యతిరేకమాన్నారు. సస్పెండ్ చేసిన కామునాయుడు, అప్పలనాయుదుల సస్పెన్షన్ ఉపసంహరించుకొని బేషరుతుగా విదుల్లోకి తీసుకోవాలన్నారు. 2011 నుండి 2020 ఏప్రిల్ వరకు ప్రభుత్వం ప్రకటించిన డి.ఎ ను ఉద్యోగులందరికీ చట్టప్రకారం చెల్లించారు, కానీ 2020 అక్టోబరు నుండి నేటి వరకు డి. ఏలను ఏ ఒక్కరికి చెల్లించలేదన్నారు. బకాయి ఉన్న 7 డి.ఏలను ఎరియర్స్ తో పాటు చెల్లించాలన్నారు. 2017 వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం చేసుకున్నాం, (2011-2013-2015-2017) 2019లో జరగాల్సిన వేతన ఒప్పందం నేటికి జరగలేదన్నారు. వెంటనే వేతన ఒప్పందం చేయాలనీ డిమాండ్ చేశారు. కక్షసాదింపుల్లో బాగంగా కొంత మంది ఉద్యోగులను బదిలీ చేసారు. వీరికి మిల్స్లోనే డ్యూటీలు ఇవ్వాలనీ, 2సం॥రాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారందరినీ రెగ్యులర్ చేయాలనీ డిమాండ్ చేశారు. 2019లో వేతన ఒప్పందానికై ఉద్యోగులు పోరాడిన సందర్భంగా కొంతమంది ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎం.నారాయణరావు, ఏ ఐ ఎఫ్ టి యు నాయకులు బి.శంకరరావు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్, డి వై ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు హరీష్, శ్రామిక మహిళా సంఘం నాయకులు బి.సుధారాణిలు మద్దతు తెలిపారు. ధర్నాలో మిమ్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️