3న జర్నలిస్టుల కొవ్వొత్తుల ప్రదర్శన : ఎపిడబ్ల్యుజెఎఫ్‌

Apr 29,2024 23:51 #APWJF, #Candle raly

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో రాష్ట్రంలో హక్కుల సాధన కోసం మే 3న జర్నలిస్టులంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ వెంకట్రావ్‌, జి ఆంజనేయులు, ఎపిబిజెఎ రాష్ట్ర నాయకులు వి శ్రీనివాసరావు, కె మునిరాజు, ఎన్‌ఎజె అధ్యక్షులు ఎస్‌కె పాండే, ఎన్‌ కొండయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో జర్నలిస్టులపై హింస మరింత పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిజాన్ని కాపాడండి.. జర్నలిస్టులను రక్షించండి అనే నినాదంలో మే 3న చేపట్టనున్న కొవ్వొత్తుల ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు.

➡️