30 నుంచి డిఎస్‌సి

Mar 10,2024 10:42 #30, #D.Sc, #Education Department
  • ఏప్రిల్‌ 30 వరకు నిర్వహణ
  • కొత్త షెడ్యూల్‌ ప్రకటించిన విద్యాశాఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్‌సి-2024 కొత్త షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 6,100 పోస్టులకు ఫిబ్రవరి 12వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్‌, డిఎస్‌సి పరీక్షలకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల నేపధ్యంలో కొత్త షెడ్యూల్‌ రూపొందించామని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవ్వడానికి తగినంత విరామం ఇస్తూ నూతన షెడ్యూల్‌ రూపొందించామని పేర్కొన్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు రోజుకు రెండు పూటల ఎస్‌జిటి పరీక్ష ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌ 7 నుంచి టిజిటి, పిజిటి, ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 13 నుంచి 30 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌, టిజిటి, పిజిటి, ఫిజికల్‌ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పరీక్షలను జరుగుతాయని తెలిపారు. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాలను అభ్యర్థులు ఎంపిక చేసుకునేందుకు వెబ్‌ ఆప్షన్లు ఇస్తామని వెల్లడించారు. మార్చి 25 నుంచి అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. ఏప్రిల్‌ ఐఐటి, జెఇఇ వంటి ఎంట్రన్స్‌ పరీక్షలు ఉండటం వల్ల పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బిఎడ్‌ అర్హత కలిగిన అభ్యర్థులు ఎస్‌జిటి పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో గతంలో ప్రకటించిన జివో 11లో ఎస్‌జిటి అర్హతలు మారుస్తూ జివో 22ను ఈ నెల 6వ తేదీన విడుదల చేశామని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు aజూసరష.aజూషటరర.ఱఅ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు.

➡️