5 నుంచి అసెంబ్లీ

Feb 2,2024 08:10 #ap assembly, #meetings

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఐదో తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గరవ్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఐదో తేదీ ఉదయం పది గంటలకు గవర్నరు ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి పిపికె రామాచార్యులు తెలిపారు. అనంతరం జరిగే బిఎసిలో సమావేశం ఎన్నిరోజులు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకుంటారు. అయితే మూడు రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ సమావేశాల్లోనే ఒటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కూడా పెట్టనున్నారు.

➡️