ఎన్నికల చరిత్రలో ప్రత్యేకమైన రోజు – టిడిపి అధినేత చంద్రబాబు

May 13,2024 23:46 #chandrababu, #speech

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సోమవారం ప్రత్యేకమైన రోజు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూశాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించిందని సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్యం పాలన సాధించుకోవాలనే కసి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరులోనూ స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఒకే రకమైన సంకల్పంతో ఓటు వేయడానికి వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చారని వివరించారు. రాష్ట్రం కోసం పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూస్తే 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇది శుభసూచకమని తెలిపారు.

➡️