తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా  27వ మలుపు వద్ద రైలింగ్‌ను కర్ణాటక యాత్రికుల వాహనం డీకొట్టింది. ఈ ప్రమాదంలో యాత్రికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమిక్షించారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తిరుమలలో యాత్రికుల రద్దీ : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం స్వామివారిని 65,361 మంది యాత్రికులు దర్శించుకోగా 20,784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.

➡️