అన్ని జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి చర్యలు

Feb 29,2024 11:05 #Hydro Power, #Sileru River

లేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్రీధర్‌

ప్రజాశక్తి -సీలేరు : సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని సీలేరు, డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో మార్చి ఐదు నుంచి ఎపి జెన్‌కో ఉన్నతాధికారి ఆదేశాల మేరకు విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీలేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్రీధర్‌ వెల్లడించారు. స్థానిక విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో విద్యుత్‌ ఉత్పత్తి అంతరాయం లేకుండా గోదావరి డెల్టా రబీ పంట నీటి అవసరాల మేరకు ఈ నెల 10 నుంచి సీలేరు కాంప్లెక్స్‌లో జల విద్యుత్‌ కేంద్రాలను విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేసినట్లు చెప్పారు. మార్చి ఐదు నుంచి నీటి విడుదల చేయాలని ఇరిగేషన్‌ అధికారులు కోరడంతో జల విద్యుత్‌ కేంద్రాలను విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీటిని గోదావరి డెల్టాకి విడుదల చేయాలని జెన్కో ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు విలువడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం 4000 క్యూసెక్కులు నీరు విడుదలయ్యేలా మార్చి ఐదు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం బలిమెల రిజర్వాయర్‌లో ఏపీ వాటా 19.15 టీఎంసీలు, సీలేరు డొంకరాయి జలాశయాల్లో 13.40 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయని, ఈ నీటితో రాబోయే మూడు నెలలు విద్యుత్‌, తాగునీటికి, గోదావరి డెల్టా అవసరాలకు పొదుపుగా వినియోగించుకోవడానికి అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు.

 

➡️