రేపు తెనాలిలో కూటమి సభ

nadendla manohar on irregularities in land allotments
  •  హాజరు కానున్న పవన్‌ కల్యాణ్‌ : నాదెండ్ల మనోహర్‌

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : టిడిపి, జనసేన, బిజెపి కూటమి సభను బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్నట్లు, సభకు పవన్‌ కల్యాణ్‌ హాజరుకానున్నట్లు జనసేన పిఎసి చైర్మన్‌, తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ సందర్భంగా తెనాలిలోని సుల్తానాబాద్‌లో హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం నాలుగు గంటలకు హెలికాఫ్టర్‌ ద్వారా చెంచుపేటకు పవన్‌ కల్యాణ్‌ చేరుకుంటారని, అక్కడి నుంచి వారాహి వాహనంపై రోడ్‌షోలో పాల్గొంటూ సాయంత్రం ఆరుగంటలకు మార్కెట్‌ కూడలిలోని పురవేదిక వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. మహిళలు, కౌలు రైతుల కోసం ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలను, తెనాలి ప్రాంత అభివృద్ధి ప్రణాళికను పవన్‌ వివరిస్తారని తెలిపారు.

➡️