కొనసాగుతున్న కార్డన్‌ సెర్చ్‌

May 22,2024 22:52 #An ongoing, #cordon search

– 803 వాహనాలు సీజ్‌
– డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా హెచ్చరించారు. పోలింగ్‌కు ముందు పోలింగ్‌ తర్వాత రాష్ట్రంలో పెద్దయెత్తున హింస చెలరేగడంతో కౌంటింగ్‌ నాటికి శాంతిభద్రతలను అదుపులో వుంచేందుకు పోలీస్‌శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమం రెండో రోజు బుధవారం నాడు 168 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 803 వాహనాలను సీజ్‌ చేశారు. అలాగే 185 లీటర్ల ఐడి లిక్కర్‌, 18.94 లీటర్ల నాన్‌ డ్యూటీ లిక్కర్‌, 130 సెల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో మరో నలుగురికి 41 సిఆర్‌పిసి కింద నోటీసులిచ్చారు. ఈ మేరకు కార్డన్‌ సెర్చ్‌పై డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అనుమానస్పదంగా వుంటే 112కు, 100కు డయల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️