16thDay: రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి – అరెస్టులు

anganwadi strike 16th day kakinada

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మె 16వ రోజు విజయవంతంగా సాగుతుంది.  మంగళవారం ప్రభుత్వం, అంగన్వాడీల సంఘాలకు జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహితంగా వ్యవహరించింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి చేయాలని మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించారు. దీనిలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 

anganwadi strike 16th day atp vip

ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నివాసం వద్ద అంగన్వాడీల ధర్నా

ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నివాసం వద్ద అంగన్వాడీ కార్యకర్తల ధర్నా.రాయదుర్గం:– గత 16 రోజులుగా ఆందోళన మరియు సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం రాయదుర్గంలో స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నివాసం వద్ద గంటకు పైగా ధర్నా చేపట్టారు. ముందుగా పట్టణంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నుండి రాయదుర్గం నియోజకవర్గం లోని ఐదు మండలాల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లతో కలిసి ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి కనేకల్ రోడ్డు మీదుగా ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం ఎమ్మెల్యే ఇంటి ముందు గంటపాటు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే పిఏ కి అందజేసారు .ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం బాల రంగయ్య ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి వర్కర్ల పట్ల అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యపు ధోరణిపై నాయకులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున, సిపిఎం సీనియర్ నాయకులు నాగరాజు, సిపిఎం నాయకులు మధు రమేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లోకేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎం మల్లికార్జున, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాయదుర్గం ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు గోవిందమ్మ మేరీ, రాధమ్మ, కనేకల్ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు పార్వతి, లావణ్య మరియు ఆయ మండలాల సెక్టర్ లీడర్లు, మరియు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

 

anganwadi strike 16th day atp balayya

బాబు నోరు విప్పలేదు… మీరైనా విప్పండి….
బాలయ్య ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు….
అంగన్వాడిల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపిన బాలయ్య
హిందూపురం : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 16 రోజుల నుంచి అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో కనీస చలనం లేదని…. కనీసం ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సైతం వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం లేదని… బాలయ్య బాబు మీ బావ చంద్రబాబు ఎలాగూ నోరు విప్పడం లేదు… కనీసం మీరైనా నోరు విప్పి తమ సమస్యలపై ప్రస్తావించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి ముందర బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బాలకృష్ణ నోరు విప్పాలి….. తమ సమస్యలపై స్పందించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జడ్పీ, శ్రీనివాసులు, ఈ ఎస్. వెంకటేష్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి లావణ్య లు మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నది తప్ప పరిష్కరించడం లేదన్నారు. అధికార పక్షం ఇలా వ్యవహరిస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఆందోళన చేస్తున్న శిబిరాల వద్దకు వచ్చి తాము పార్టీ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నామని చెబుతున్నారు. అయితే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాత్రం అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ఇప్పటికైనా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ సమస్యలపై స్పందించకపోతే వీళ్ళ ముట్టడితో ప్రారంభమైన ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేసి ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను, పార్టీ ఇంచార్జ్ లను అడ్డుకుంటామన్నారు. ఈ ఉద్యమాన్ని పోలీసులు అడ్డుపెట్టుకొని అణిచివేయాలని చూస్తే మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండుటెండల్లో అంగన్వాడి మహిళలు దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన చేశారు. చివరకు ఇక్కడ జరుగుతున్న ఆందోళన కార్యక్రమం గురించి ఎమ్మెల్యే బాలకృష్ణకు తన వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ ద్వారా వివరించారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని, త్వరలో హిందూపురం వచ్చి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతానన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సైతం వివరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దీంతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఆందోళనలను విరమించి వెనతిరిగారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాంబ శివ, రాజప్ప, రామక్రిష్ణ,లక్ష్మీ నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం ప్రవీణ్, అంగన్వాడి వర్క్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు శోభ, శిరీష, నాగమ్మ,వరలక్ష్మితో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

 

anganwadi strike 16th day prakasam

అంగనవాడి వర్కర్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా 16వ నిరవధిక సమ్మెను ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఒంగోలు ప్రాజెక్ట్ కమిటీ, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాల్గొన్న శిబిరాల్లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బరమ్మ

anganwadi strike 16th day gnt

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు…

 

గుంటూరు జిల్లాలో పి మహేష్ , రాజకుమార్లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ జీపులో తీసుకెళ్లారు. స్థానిక కేరళ హోటల్ వద్ద ఆందోళన కారులను అద్దగించారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన చేస్తూ సమస్యలు పడిపోయిన అంగనవాడి టీచర్

anganwadi strike 16th day manyam

పార్వతీపురం మన్యం జిల్లా : ఎమ్మెల్యే చినమేరంగిలో పుష్ప శ్రీవాణి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు.

మా సమస్యలు పరిష్కరించేలా సీఎంకు వివరించాలని కోరిన అంగన్వాడీలు, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ సిబ్బంది

 

anganwadi strike 16th day manyam

విప్ ఇల్లు ముట్టడి
మన్యం జిల్లా – పాలకొండ : రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ లు చేస్తున్న నిరసన కార్యక్రమాలు బుధవారానికి పదహారవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పాలకొండ డివిజన్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విప్ స్థానిక ఎమ్మెల్సీ విక్రాంత్ బాబు ఇల్లు ముట్టదించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ధావాల రమణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ హిమప్రభ, జిల్లా కోశాధికారి బి అమరవేణి, సిఐటియు సీనియర్ నాయకులు ఎం తిరుపతిరావు మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో ఎక్కడైతే వలంటీర్లు, మహిళ పోలీసులు మరియు వెలుగు సిబ్బంది మరియు సచివాలయం సిబ్బందితో పాటు ఇతర అధికారులు అంగన్వాడి సెంటర్ తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలానే చర్చలకు పిలిచి మంత్రివర్గం ఉప సంఘం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకుండా బెదిరించే పద్ధతిలో మాట్లాడడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా ఖండించారు. జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడి కార్యక్రమం లో భాగంగా పాలకొండ కేంద్రం కూడా నిర్వహించామని, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తక్షణమే అంగన్వాడీ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని వచ్చే పరిణామాలకి ప్రజాప్రతినిధులే బాధ్యతవహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులాపాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మాకు అన్ని రకాలుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. మా సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె ఆగదని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు జి జెస్సి బాయ్, ఏ పార్వతి, ఏ దర్శమ్మి, ఆర్ భవాని, నిర్మల, బి లలిత, ఆదమ్మ, టీ దివ్య, జి శారద, రోజా రాణి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం కాంతారావు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పాలకొండ నియోజకవర్గం గల అన్ని అంగన్వాడి సెంటర్ల నుండి సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఎమ్మెల్సీ గృహంలో సామూహిక వినతిపత్రం పి రాజశేఖర్ కి అందజేశారు.

 

anganwadi strike 16th day wg

పగో: అత్తిలి మండలం అంగన్వాడీ సమ్మె పదహారు రోజులు పూర్తి అయిన సందర్భంగా 16 సంఖ్యగా ఏర్పడ్డారు.

 

anganwadi strike 16th day tpt arrest a

తిరుపతి జిల్లా : పుత్తూరులో అంగన్వాడీల సమస్యలపైన మంత్రి రోజాకి వినతిపత్రం ఇవ్వడానికి పోతుంటే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.

anganwadi strike 16th day bapatla

బాపట్ల జిల్లా : రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ఇంటి వద్ద అంగన్వాడీలు నిరసన….

అంగన్వాడీల హామీలు సీఎం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని మోపిదేవి వెంకటరమణారావు హామీ ఇచ్చారు.

anganwadi strike 16th day vzm mla

  • డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి లేఖ రాసిన కోలగట్ల 
విజయనగరం టౌన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే విజయనగరం లో స్థానిక బాలాజీ జంక్షన్ నుంచి డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి కి భారీ ర్యాలగా వెళ్లి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెలపర్సే యునియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ లు మాట్లాడుతూ అంగన్వాడీలు మాట్లాడుతూ 16 రోజులైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం 11 డిమాండ్ల తో కూడిన వినతపత్రాన్ని అందచేశారు. స్పందించిన డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వెంటనే ముఖ్యమంత్రి కి అంగనవాడీలు సమస్యలు పరిష్కారం చేయాలని లేఖ రాసి ఫ్యాక్స్ లో పంపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు బి.రమణ, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

anganwadi strike 16th day atp d

గుంతకల్లులో అంగన్వాడి వర్కర్ల సమ్మె ఉధృతం.

సిఐటియూ, అంగన్వాడి వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన అంగన్వాడి వర్కర్లు,ఇంటికి దూరంగా బారికేడ్లను పెట్టీ అడ్డగించిన పోలీసులు. అక్కడే బైఠాయించి పోలీసులతో నేతల వాగ్వివాదం. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమార్తె మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి వచ్చి నేతలతో వినతి పత్రాన్ని తీసుకున్నారు.

అనంతపురం జిల్లా

anganwadi strike 16th day atp

పెనుకొండలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

అనంతపురం జిల్లా -పెనుకొండ : అంగన్వాడీ వర్కర్ సమస్యలు పరిష్కరించాలని16వ రోజు నిరవధిక సమ్మె భాగంగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఇంటి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఇంటి గేట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం చర్చలు పేరుతో అవమానపరచడం సిగ్గుచేటు అన్నారు.అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

anganwadi strike 16th day kadapa

కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం లేకపోవడంతో పిఎకి వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట దాదాపు గంటన్నర పాటు తమ నిరసన తెలియజేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఓబులేసు, అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, అర్బన్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి అంజనీదేవి, కార్యకర్తలు ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు.

 

anganwadi strike 16th day akp

ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలు నాయుడు క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆందోళన

అనకాపల్లి జిల్లా -దేవరాపల్లి మండలం తారువాలో ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలు క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం అంగన్వాడీలు పెద్ద ఎత్తున అందోళన చేసి వినతిపత్రం సమర్పించారు. మంత్రి సానుకూలంగా,స్పందించారు,ముఖ్యమంత్రి ద్రుష్టికి అంగన్వాడీలు సమస్యలు తీసుకువెళ్తామని హమి ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడారు, అంగన్వాడీలను ప్రభుత్వం రోడ్డున పడేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంగళవారం మంత్రి బోత్స సత్యనారాయణ సజ్జల రాక్రుష్ణ రెడ్డితో జరిగిన చర్చలు మొక్కబడిగా జరిగాయని  రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడి వర్కర్స్’మినీ వర్కర్స్’ హెల్పర్స్ వేతనాలు పెంచాలని. గ్రాట్యూటి అమలు చేయాలి ఐసిడిఎస్ పటిష్ట పర్చాలని నాణ్యమైన సరుకులు అందించాలని డిమాండ్ చేస్తు, అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది. స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి 16 కోట్లు చీరలకు మొబైల్ కు 85 కోట్ల సెంటర్లు నిర్వహణకు రీచార్జీల కోసం 12 రూపాయలు ఇచ్చామని చేప్పడం హస్యస్పదమన్నారు. ఇప్పటికీ ఆ మొబైల్స్ జిబీ,ర్యామ్ పని చేయక,సొంత మొబైల్స్ తో పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. అనేక పర్యాయాలు ప్రభుత్వానికి గ్యాస్, ఆకు కూరలు, కూరగాయలు, పోపు దినుసులకు కోట్ల రూపాయలు మిగులు తాయని ప్రీస్కూల్ పిల్లలకు బోధించ వచ్చని యూనియన్లుగా అనేక పర్యాయాలు చెప్పినప్పటికీ టేక్ హోమ్ రేషన్ ప్రవేశ పెట్టారని మరి దీనికి సంబంధించి ఎఫ్ ఆర్ ఎస్ యాప్ అదనంగా తెచ్చి తీవ్ర సమస్యలు తీసుకు వచ్చారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు పెంచుతామని చేప్పిన రాష్ట్ర ప్రభుత్వం హామీని అమలు చేయాలని నాలుగున్నర సంవత్సరాల నుండి అనేక సార్లు సంబంధిత అధికారులకు మంత్రులకు ప్రభుత్వానికి తెలియ జేసిన ప్పటికీ నేటికి వేతనాలు పెంచలేదన్నారు. ఇప్పటికే అంగన్వాడి సెంటర్లో తలుపులు బద్దలు కొట్టి గ్రామ సచివాలయం ఉద్యోగులతో నడుపుతూ మధ్యాహ్నం భోజన పథకం కార్మికులతో డ్వాక్రా మహిళలతో వంట చేపించడం అన్యాయమన్నారు. అంగన్వాడి సెంటర్ లో ఒకటీచర్ ఆయా మాత్రమే ప్రజలందరికీ సర్వీసు అందిస్తున్నరని ఇప్పుడేమో అనేక రకాలుగా గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న అందర్నీ తీసుకొచ్చి అంగన్వాడి సెంటర్లో పెట్టడం ప్రభుత్వానికి చిన్నతనంగా లేదా అని ప్రశ్నించారు. చింతా ప్రతాప రెడ్డి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి నోటికి,నచ్చినట్లు మాట్లాడుతూ అంగన్వాడీలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూన్నారని మండిపడ్డారు. చింతా ప్రతాప రెడ్డి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో. ప్రాజెక్టు కార్యదర్శి జి వరలక్ష్మి గౌరవ అద్యక్షరాలు జి,కూమారి ప్రాజెక్టు అద్యక్షరాలు భవానీ కోమాలి అమ్మాజి సన్యాసమ్మతో పాటు నాలుగు మండలాలకు చేందిన అంగన్వాడీలుతో పాటు సిఐటియు జిల్లా నాయకులు ఆర్ దేముడు నాయుడు ఇ నరసింహమూర్తి బిటి దోర డి వెంకన్న మద్దతు పలికారు.

 

 

anganwadi strike 16th day krnl

కర్నూలు ఎమ్మెల్యే ఇంటిని అంగన్వాడీలు ముట్టడి
సమస్యల పరిష్కరించాలని బైఠాయింపు
లేదంటే ఎందాకైనా సిద్ధమేనని హెచ్చరిక
భారీ ఎత్తున పోలీసులు మోహరింపు

కర్నూలు క్రైమ్ : సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన పోరాటంలో భాగంగా బుధవారం అంగన్వాడీలు కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించారు. ఈ మేరకు మధ్యాహ్నం వారు ఎమ్మెల్యే ఇంటి వద్దకు భారీ ఎత్తున తరలివచ్చి ఇంటి ముందు బైఠాయించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినదించారు. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు శ్రామిక మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి పి నిర్మల మాట్లాడుతూ… అంగన్వాడీలు గత 16 రోజులుగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు. గ్రాడ్యుటీని అమలు చేయాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.ఐదు లక్షలు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలన్నారు. చర్చలను విఫలం చేసి 15 రోజుల తర్వాత నిర్ణయాన్ని చెబుతామని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలన్నారు. ప్రభుత్వాలనే కూల్చేసిన చరిత్ర అంగన్వాడీలకు ఉందని సమస్యలు పరిష్కరించకపోతే ఎందాకైనా పోరాడేందుకు అంగన్వాడీల సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు మునెప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. తక్షణమే రూ.320 కోట్లు అప్పన తీసుకొచ్చి అంగన్వాడీల జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలని నినదించడంతో ఎమ్మెల్యే బయటకు వచ్చి అంగన్వాడీల నుంచి వినతిపత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇదివరకే అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం తగిన సమయంలో అంగన్వాడీలకు అనుకూలంగా తగిన నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితినీ దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.రేణుక, ఏఐటీయూసీ నాయకులు మునెప్ప, సిఐటియు జిల్లా నాయకులు వేణుగోపాల్, కే సుధాకరప్ప ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్ కెవిపిఎస్ నాయకులు ఆనంద్ బాబు, చిన్న వ్యాపారస్తుల సంఘం జిల్లా నాయకులు మహమ్మద్ రఫీ, రామకృష్ణ, కృష్ణ, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

anganwadi strike 16th day arrest

 

anganwadi strike 16th day arrest

విజయవాడలో పోలీసులు తోపులాటలో గాయపడ్డ అంగన్వాడీ కార్యకర్త

విజయవాడలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బయలు దేరిన అంగన్వాడీలను అరెస్టు చేస్తున్న పోలీసులు
విజయవాడలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బయలు దేరిన అంగన్వాడీలను అరెస్టు చేస్తున్న పోలీసులు
మంత్రి సీదిరి అప్పలరాజుకు వినతి పత్రం అందజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు
చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు (ఇన్ సెట్లో)ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీ నాయకులు
మైలవరంలో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీలు

anganwadi strike 16th day vsp s

అంగన్వాడీల

అంగన్వాడి కార్యకర్తలు వాళ్ళ జీవీఎంసీ దగ్గర ధర్నా ప్రజాశక్తి ప్రత్యేక సంచికుని ఆవిష్కరించిన అంగన్వాడీ నాయకులు బి తులసి,  ప్రజాశక్తి సర్క్యులేషన్ ఇంచార్జ్ అప్పలరాజు

anganwadi strike 16th day kakinada b

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు
కాకినాడ – జగ్గంపేట రూరల్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే మండలంలోని ఇర్రిపాక స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసాన్ని ముట్టడించి మండుటెండ లో నిరసన తెలిపారు. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల అంగన్వాడి వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 16 రోజులైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సుజాత, రత్నం, అనంతలక్ష్మి, గంగాభవాని, రాజేశ్వరి, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

 

anganwadi strike 16th day alluri

అల్లూరి జిల్లా : అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ క్యాంప్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ముట్టాడించారు. ఎమ్మెల్యే బయటకొచ్చే సమాధానం చెప్పేంతవరకు కదిలేది లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

anganwadi strike 16th day vsp

భీమిలీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా

anganwadi strike 16th day guntur

anganwadi

అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో అంగన్వాడీల భారీ ర్యాలీ మరియు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి

anganwadi strike 16th day vja

విజయవాడలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బయలు దేరిన అంగన్వాడీలను అరెస్టు చేస్తున్న పోలీసులు

 

anganwadi strike 16th day konaseema a

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ఇల్లు ముట్టడి

 

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించే సమయంలో సొమ్మసిల్లిన అంగన్‌వాడీ హెల్పర్ మంత్రి వరలక్ష్మీ, హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు, తోటి అంగన్వాడీలు

విజయనగరం జిల్లా – చీపురుపల్లి  : రాష్ట్ర మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన అంగన్‌వాడీలు, సిటియు మరియు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బారి ర్యాలీ, తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముందు ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.

ఏలూరు చింతలపూడిలో….

anganwadi strike 16th day vzm

విజయనగరం జిల్లా – అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడుకి భోగాపురం ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీలు సిఐటి ఆధ్వర్యంలోమెమొరాండం ఇవ్వడం జరిగింది.

 

anganwadi strike 16th day sklm
శ్రీకాకుళం – పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా. అంగన్వాడీ  కార్యకర్తలను  అడ్డుకున్న పోలీసులు.

 

anganwadi strike 16th day sklm a

శ్రీకాకుళం – ఆమదాలవలస :- అంగన్వాడీల హామీల సాధనకు రాష్ట్ర అంగన్వాడీ యూనియన్ పిలుపుమేరకు స్థానిక శాసనసభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటి ముందు అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు కే. నాగమణి అంగన్వాడి యూనియన్ నాయకురాలు పి భూలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం – ఎమ్మెల్యే బెందాలం అశోక్ కు వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీలు

 

శ్రీకాకుళం – జెడ్పీ ఛైర్పర్సన్  విజయ ఇంటివద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

 

anganwadi strike 16th day kakinada a

అంగన్వాడీల సమ్మె 16వ రోజు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి వద్ద ధర్నా

 

anganwadi strike 16th day bhimili

భీమునిపట్నం అంగన్వాడీల ఉదయం ఉధృతమవుతున్న నేపథ్యంలో “చర్చలు విఫలం.. ఉద్యమం ఉధృతం” ప్రధాన శీర్షికన ప్రజాశక్తి దినపత్రిక ప్రచురించిన అంగన్వాడీల ప్రత్యేక సంచికను బుధవారం చదువుతున్న అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు

➡️