లెనిన్ స్పూర్తితో అంగన్వాడీల పోరాటం

anganwadi workers strike 41day lenin

ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో అంగన్వాడీల నిరవధిక నిరాహారదీక్షలు 5వ రోజు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 41వ రోజుకి చేరింది. లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  వామపక్ష నాయకులు అంగన్వాడీల నిరవధిక దీక్షలకి మద్దతు తెలియజేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దీక్షా శిబిరం వద్దకు చేరుకొని తమ మద్దతు తెలియజేసారు.

anganwadi workers strike 41day lenin sklm a

 

అంగన్వాడీలని అడ్డుకున్న పోలీసులు…

శ్రీకాకుళం : విజయవాడ ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం బస్టాండ్ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో అంగన్వాడీలు 41వ రోజు సమ్మె చేపడుతున్నారు ఒకసారిగా ధర్నాకు విజయవాడకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు పరుగులు తీశారు. సీఐ ఎస్ఐ తో పాటు పోలీసులు అంగన్వాడీలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అంగన్వాడీలు రోడ్లపై బేటాయించారు. ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు అలాంటి పాటు రోడ్లపై బేటాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు అంగన్వాడీలకు తరలించేందుకు తీవ్ర ప్రయత్నం చేసేటప్పటికీ వాళ్లు ఎంతటి రోడ్లపై నుంచి లావుపోవడంతో పోలీసులకు మరియు అంగన్వాడీల మధ్య వాగు వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా అంగన్వాడీలను పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు.

సోంపేటలో అంగన్వాడీల అక్రమ అరెస్టులు

బాపట్ల జిల్లా నిజాంపట్నంలో 41వ రోజు కొనసాగిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమ్మె
మర్రిపూడి అంగన్వాడీల సమ్మె శిభిరంలో విజయవాడ వెళ్ళ రాదని నోటీసులు ఇస్తున్న మర్రిపూడి యస్ఐ

anganwadi workers strike 41day lenin vzm

విజయనగరం టౌన్  : జగనన్నకు వంగి దండం పెట్టిన అంగన్వాడీలు… కోటి సంతకాలతో మా మోర ఆలకించండి విజ్ఞాపన

ఆదివారం నాడు అంగన్వాడీల 41వ రోజు సమ్మె కొనసాగింది. విజయనగరం కలెక్టరేట్ వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీలు వంగి జగనన్నకు నమస్కరిస్తూ మా మోర ఆలకించండని విజ్ఞప్తి చేశారు.

 

 

 

 

➡️