అంగన్‌వాడీల సమ్మె విచ్ఛిన్నంపై ఆగ్రహం…

anganwadi workers protest 4th day

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం తీరు మారలేదు. నాల్గో రోజు కూడా సమ్మె విచ్ఛిన్న చర్యలను కొనసాగిస్తుంది. సమస్యలను పరిష్కరించకుండా కుట్రలకు పాల్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టించి, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. వారికి సహకారులుగా వలంటీర్లను నియమించింది. కొన్ని చోట్ల సెంటర్ల తాళాలను అధికారులు బద్దలు చేస్తుండగా అంగన్‌వాడీ లబ్ధిదారులు, అంగన్‌వాడీలు అడ్డగించారు. సమస్యలను పరిష్కరించమంటే ఇలా తాళాలు పగులగొట్టడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.


మొక్కవోని దీక్షతో పోరాటంలో పాల్గొంటున్న అంగన్వాడీలు.. నెల్లూరు జిల్లాలో జోరు వానలోను కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె…

1 anganwadi workers protest 4th day konasema
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో 4వ రోజుకు అంగన్వాడీల సమ్మె… భారీ ర్యాలీ, రాజారత్న కూడలిలో మానవహారం.

1 anganwadi workers protest 4th day eg
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం మండలం చెందిన అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు తమ డిమాండ్ల పై 4వ రోజు దీక్షా కార్యక్రమం చేపట్టారు. అనంతరం అంగన్వాడి కార్యకర్తతలు భిక్షాటన. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంగనవాడి కార్యకర్తలకు కొవ్వూరు నియోజకవర్గం జనసేన నాయకులు మద్దతు తెలిపారు.

anganwadi workers protest 4th day bapatla
బాపట్ల పట్టణంలో అక్బర్ పేట అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొడుతున్న మున్సిపల్ అధికారులు


అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో నాలుగవ రోజు సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు



అన్నమయ్య జిల్లా రాజంపేట అర్బన్ లో నల్ల బ్యాడ్జీలతో అంగన్వాడీల నిరసన… కాంగ్రెస్, ఎలక్ట్రిసిటీ, ఎస్ఎఫ్ఐ, ఏఐటీయూసీ యూనియన్లు సంఘీభావం

annamayya anganwadi workers protest 4th day
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ధర్మపురం అంగన్వాడి కేంద్రాన్ని సిడిపిఓ టిపి సౌభాగ్యమ్మ ఎంపీడీవో జాషువా సమక్షంలో బీగాలు పగలగొట్టి కోడూరు 2 సచివాలయానికి చెందిన కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు.

atp anganwadi workers protest 4th day cpm
అంగన్వాడీ కార్మికుల సమ్మెకు సిపిఎం మద్దతు
అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరుగుతున్న నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్

తాళాలు బద్దలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోండి

kakinada anganwadi workers protest 4th day ps

తాళాలు బద్దలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోండి
కాకినాడ-పెద్దాపురం : అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాలుగవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ సెంటర్ లో సమ్మె శిబిరం కొనసాగింది. ఈ శిబిరంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అంగన్వాడీలు సమ్మెలో ఉండగా అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై వి సురేష్ కు పిర్యాదు అందజేశారు. సెంటర్లో రికార్డులు, సామాన్లు పోతే తమకు సంబంధం లేదని, అందుకు ఐసిడిఎస్ అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డాడీ బేబీ అధ్యక్షతన జరిగిన సమ్మె శిబిరంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చెక్కల రమణి షమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉండి మరీ అంగన్వాడి సెంటర్ తాళాలు బద్దలు కొట్టించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి క్రాంతి కుమార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు నాగమణి, అమల, వరలక్ష్మి, ఫాతిమా, ఎస్తేరు రాణి, వన కుమారి, వసంత, తులసి, పద్మ, స్నేహలత, నెహ్రూ కుమారి, కాలే దేవి, జె సూర్య కుమారి, జ్యోతి, మాచరమ్మ, లోవ తల్లి తదితరులు పాల్గొన్నారు.

akp anganwadi workers protest 4th day child
అనకాపల్లి కసింకోట జాతీయ రహదారి పక్కన తమ సమస్యలు పరిష్కారం చేయాలని చిన్నపిల్లలతో అంగన్వాడి కార్యకర్తల డిమాండ్

eluru anganwadi workers protest 4th day

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో అంగన్వాడి సంస్థల పరిష్కరించాలని కోరుతూ నాల్గవ రోజు సమ్మె సందర్భంగా ఎమ్మార్వో ఆఫీస్ నుండి ఎండిఓ ఆఫీస్ వద్ద ర్యాలీగా వెళ్లి నిర్వహించడం జరిగింది అనంతరం ఈఓపిఆర్ డి శ్రీహరికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట మోకాళ్లపై నిలబడి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి సమస్యల పరిష్కరించకపోగా అంగన్వాడీలను బెదిరింపులకు గురి చేస్తా ఉంది. దౌర్జన్యంగా అంగన్వాడి సెంటర్లను తాళాలు బద్దలు కొట్టడం చాలా దుర్మార్గం అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను రాజకీయ నాయకులు సచివాలయ సిబ్బంది కలిసి అంగన్వాడి సెంటర్లను తాళాలు బద్దలు కొడుతున్నారు ఇది సరైనది కాదు ప్రభుత్వం తక్షణమే ఈ చర్యల మానుకోవాలని అన్నారు. ఈ కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర ధరలు అనేక రెట్లు పెరిగాయి కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కనీస వేతనం, పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలి. మినీ సెంటర్ మెయిన్ సెంటర్ లుగా గుర్తించాలి, ఎఫ్ ఆర్ సి ఎస్ యాప్ ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కృపమణి, పుష్ప, రామలక్ష్మి, మరమ్మ, భూదేవి, రమయమ్మ, నూజహన్, మున్ని, పార్వతి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

manyam anganwadi workers protest 4th day b

manyam anganwadi workers protest 4th day c
పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం తాసిల్దార్ నరసింహుర్తికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పార్వతి దర్శిమి సిఐటియు మండల కార్యదర్శి కాంతారావు తదితరులు ఉన్నారు.

manyam anganwadi workers protest 4th day

manyam anganwadi workers protest 4th day a
పార్వతీపురం మన్యం జిల్లా పలు అంగన్వాడీ కేంద్రాల తలుపుల తాళాలను పగలగొట్టి లోనకు ప్రవేశించిన ఐసిడిఎస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు.

prakasm anganwadi workers protest 4th day
ప్రకాశం జిల్లాలో అంగన్వాడీల నిరసన

prakasm anganwadi workers protest 4th day tdp
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపిన టిడిపి శ్రేణులు

prakasm anganwadi workers protest 4th day utf
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నాలుగో రోజు నల్ల చీరలు ధరించి నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపి మాట్లాడుతున్న యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి

విజయనగరం జిల్లా కొండగండ్రేడులో అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ గోవింద్ సమక్షంలో తలలు పగల గట్టి కేంద్రాన్ని ప్రారంభించిన సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సూపర్ వైజర్.ఉమామహేశ్వరి

nandyala anganwadi workers protest 4th day
నంద్యాల జిల్లా చాగలమరి మండలంలోని చాగలమర్రి పట్టణంలోని కేరళ ఆసుపత్రి ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు చేపట్టిన ఆందోళన దీక్షలు శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు సిఐటియు నాయకురాలు పద్మావతి, వసంత, నాగమణి, వై పద్మావతి ఏఐటీయూసీ నాయకులు చంద్రకళ, వహీదా ఇందుమతి, ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

wg anganwadi workers protest 4th day undi
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కాపులపేటలోని అంగన్వాడి కేంద్రం 100 తాళాలు పగలకొట్టి స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు, స్థానిక వార్డు సభ్యులు చెన్నంశెట్టి హరి నాయుడు

gnt anganwadi workers protest 4th day
గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి స్వాధీనం చేసుకున్న సచివాలయ సిబ్బంది…

kadapa anganwadi workers protest 4th day porumamilla
కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అంగన్వాడి సెంటర్లకు ఉన్న తాళాలను పగలగొడుతున్న ఎంపీడీఓ, సిబ్బంది

vzm anganwadi workers protest 4th day
గంజి పేటలో అంగన్వాడీ కేంద్రాన్ని తీసే ప్రయత్నం… అడ్డుకున్న స్థానికులు
విజయనగరం టౌన్ లో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేయడంతో అంగన్వాడీ కేంద్రాలను తెరిపించే ప్రయత్నం సచివాలయం సిబ్బంది రావడంతో రెల్లి వీధి అంగన్వాడీ కేంద్రం వద్ద స్థానికులు అడ్డుకున్నారు. మేము అద్దెకు ఇచ్చాం, తాళాలు పగలు కొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో చేసేది లేక సచివాలయం ఉద్యోగి బయటన వేచి ఉండిపోయారు. మరో వైపు కలెక్టరేట్ ఎదురుగా సంజీవ నగర్ కాలనీలో తాళాలు బద్దలు కొట్టే అంగన్వాడీ కేంద్రం ఓపెన్ చేశారు.

kadapa anganwadi workers protest 4th day
కడప జిల్లాలో అంగన్ వాడి కేంద్రాలకు ఉన్న తాళాలు పగులకొట్టి, అంగన్ వాడిలో డ్యూటి చేస్తున్న సచివాలయం వెల్ఫేర్ సిబ్బంది

wg anganwadi workers protest 4th day
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి గోరింతోటలోని ఉండి 105 అంగన్వాడి కేంద్రాన్ని ఉండి నాల్గవ సచివాలయ సెక్రటరీ శ్రీలత స్వాధీనం చేసుకుని ఎంపీపీ స్పెషల్ పాఠశాల ఉపాధ్యాయురాలు సిహెచ్ కాంతమ్మకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఉండి గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, గ్రామ రెవెన్యూ అధికారి గొల్ల, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

yalamanchili anganwadi workers protest 4th day
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో అంగన్వాడీల సమ్మె

atp anganwadi workers protest 4th day
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో అంగన్వాడీ కేంద్రానికి వేసిన తాళాలను పగలగొడుతున్న రెవెన్యు మరియు మున్సిపల్ మెప్మా సిబ్బంది.

atp anganwadi workers protest 4th day battalapalli
అనంతపురం జిల్లా బత్తలపల్లి కేంద్రంమంలో అంగన్వాడి సెంటర్లను తాళాలు పగలగొడుతున్న అధికారులు

alluri anganwadi workers protest 4th day
అనంతపురం జిల్లా డొక్క పాలెం గ్రామంలో అంగన్వాడి సెంటర్ తాళాలు తీయకపోతే సచివాలయం సిబ్బందిని గ్రామ పోలీసులను అటాయించిన గ్రామస్తులు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్

atp anganwadi workers protest 4th day lepakshi
అనంతపురం జిల్లా లేపాక్షి మండలం లో అంగన్వాడీ కేంద్రం ను తెరిచినా సచివాలయం సిబ్బంది

➡️