తగ్గేదేలే… అంగన్‌వాడీల సమ్మె 5వ రోజు

eluru anganwadi strike 5th day

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్‌వాడీల సమ్మె మరింత ఉదృతంగా సాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీలు సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. మొదటి రోజు నుండి నేటి వరకు అదే పోరాట పటిమతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని అంగన్‌వాడీ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మూడుసార్లు చర్చలు జరిపినా పురోగతి లేదని, ప్రభుత్వం మొండి వైఖరితో ఉందనీ సంఘాల నాయకులు పేర్కొన్నారు.
nlr anganwadi strike 5th day rally
నెల్లూరు : అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటి అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేస్తున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె ఐదవ రోజు వి ఆర్ సి వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నల్ల రిబ్బనలు మూతికి కట్టుకొని నిరసన ర్యాలీ.

konaseema anganwadi strike 5th day
మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్సీ ఐవి, అంగన్వాడీ కార్యకర్తలు

kadapai anganwadi strike 5th day child
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో చిన్నారులతో అంగన్వాడీ కార్మికుల నిరసన

wg anganwadi strike 5th day palakollu
సాబ్జీకి ఘన నివాళులు
పగో-పాలకొల్లు : ఉద్యోగులు, కార్మికుల ఉద్యమాలకు బాట వేసిన ఎమ్మెల్సీ సాబ్జీ మృతి కార్మిక, ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తీవ్ర సంతాపం తెలిపింది. శనివారం పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు 5వ రోజు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, పురుషోత్తం, సీనియర్ ఉపాధ్యాయుల నేత వలవల శ్రీరామమూర్తి, డి అజయ్, అంగన్వాడీ నేతలు శ్రీదేవి, నాగలక్ష్మి, సత్యవతి, ఝాన్సీ, పద్మావతి, రూతు, ఎ లక్ష్మీ దుర్గ, పి ధనలక్ష్మి పాల్గొన్నారు.

vzm anganwadi strike 5th day town
విజయనగరంలో అంగన్వాడీల సమ్మె
విజయనగరం టౌన్ : అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 5వ రోజుకి చేరుకుంది. జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్సు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జరిపిన చర్చల్లో ఆర్ధిక పరమైన డిమాండ్ లు పరిష్కారానికి చొరవ చూపకుండా చర్చలు ముగించడం సరికాదన్నారు. మేము ఎది అదనంగా కోరడం లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని కోరుతున్నామన్నారు. 5 రోజులు కావస్తున్నా సమస్యలు పరిష్కారం చేయకుండా, మరో వైపు అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తాళాలు పగలు కొట్టించడం ప్రభుత్వానికి తగదన్నారు. సచివాలయం ఉద్యోగులు కూడా తోటి ఉద్యోగులేనని, చాలా జిల్లాలో సచివలయం ఉద్యోగులు కేంద్రాలను తెరిచేందుకు ముందుకు రాలేదని జిల్లాలో ఉన్న సచివాలయం ఉద్యోగులు మాకు సహకరించాలని కోరారు. బలవంతంగా కేంద్రాలు తేరిపించడం, మమ్మల్ని బెదిరించడం వంటి చర్యలు మానుకోవాలని, బెదిరింపులకు భయపడేది లేదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం మా ఆర్ధిక పరమైన డిమాండ్ లు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని ఆమె హెచ్చరించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఏపిటీఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు బంకురు జోగినాయుడు అంగన్వాడీలు సమ్మెకు మద్దతు తెలిపారు. అంగన్వాడిలు చేస్తున్నది న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం జిల్లా అధికారులకు మూకుమ్మడిగా వెళ్లి అంగన్వాడీలు వినతి పత్రం అందజేశారు. సమ్మె నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

vzm anganwadi strike 5th day a
విజయనగరం-రాజాం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మెపై మొండి వైఖరి మానుకొని, తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాంలో 5వ రోజు నల్ల రీబ్బనాలతో మోకాళ్లపై జరిగిన నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాoలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె లక్ష మంది చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, దీని మూలంగా గర్భిణీలు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, సమ్మెకు ముందు సమ్మె తర్వాత రాష్ట్ర మంత్రివర్గ కమిటీ , అధికారులు యూనియన్ తో చెట్లు జరిగి ఎటువంటి పరిష్కారం చూపడం సరైన పద్ధతి కాదని, చర్చల పేరుతో కాలయాపన చేయడం ఏ రకమైనటువంటి వైఖరు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని, జీతాల పెంపు ,గ్రాటివిటీ ,పెన్షన్ వంటి ప్రధాన సమస్యల పరిష్కారం చేయకుండా ఇతర అంశాలపై చర్చించి చర్చల పేరుతో సాధారణ ప్రజానీకాన్ని అంగన్వాడిని తప్పుతావు పట్టించే ప్రయత్నం మానుకోవాలని తీవ్రంగా విమర్శించారు, జీతాల పెంపు గ్రావిటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని అడిగితే ఆర్థిక కారణాలు చెప్పడం ఇది ఏ రకమైనటువంటి పద్ధతిని ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని మరి ఏ రకంగా చెప్పారని ప్రశ్నించారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.

manyam anganwadi strike 5th day saluru
మన్యం జిల్లా సాలూరులో అంగన్వాడీల నిరసన

gnt anganwadi strike 5th day achhampeta
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో అంగన్వాడి టీచర్లు తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ టీచర్లు మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ హెచ్చరించారు.

gnt anganwadi strike 5th day krosuru
గుంటూరు జిల్లా క్రోసూరు కేంద్రంలో న్యాయమైన తమ కోరికల సాధన కోసం ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ కు వ్యవసాయ కార్మిక సంఘం తరఫున సంఘీభావం తెలుపుతున్న పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వర రెడ్డి

gnt anganwadi strike 5th day
గుంటూరు జిల్లా తూములూరు అంగన్వాడీ సెంటర్ తాళం పగలకొటేందుకు అధికారులు ప్రయత్నాలకు నిరసనగా పడుకొని నిరసన తెలుపుతున్న ములకా శివసాంబిరెడ్డి

mlc iv anganwadi strike 5th day
సమ్మెపై అణచివేత ధోరణి సరైంది కాదు : ఎమ్మెల్సీ ఐవి

కోనసీమ జిల్లా రామచంద్రపురం : అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం అణచివేయాలన్న ధోరణి సరైంది కాదని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడి వర్కర్ల నిరవధిక సమ్మెకు ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు పాల్గొని మద్దతు తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఐదేళ్లు కావస్తున్న హామీ అమలు కాలేదని దీనితో అంగన్వాడీ వర్కర్లు సమ్మెకు దిగారని ఆయన వివరించారు. సమ్మె పరిష్కారమయ్యే దిశగా అంగన్వాడి వర్కర్ల కు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సమ్మెను అణచివేయాలని, అంగన్వాడి సెంటర్ లో తాళాలు పగలగొట్టించడం వంటి చర్యలకు పూనుకోవడం సరైనది కాదని ఆయన విమర్శించారు. అదేవిధంగా మంత్రి బొత్స సత్యనారాయణ రాజ్యాంగేతర పదాలను ఉపయోగిస్తున్నారని ఉద్యమ సంఘాల నాయకులు ప్రభుత్వం కాళ్లు పట్టుకోవాలని అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని ప్రభుత్వం కాళ్లు పట్టుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అంగన్వాడి సమస్యలను పరిష్కరించమంటే జగన్ అంగన్వాడీలను తొలగించమన్నారని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. అంగన్వాడి వర్కర్లను తొలగిస్తే వారు మిమ్మల్ని పదవుల్లోంచి తొలగివేస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల జీతాలు పెంచాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘం నాయకులు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, ఎం కృష్ణవేణి, దుర్గ, కే గంగవరం రామచంద్రపురం మండలాల అంగన్వాడీ వర్కర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

annamayya anganwadi strike 5th day pileru
కళ్లకు గంతలతో అంగన్వాడీల నిరసన
అన్నమయ్య జిల్లా పీలేరు: అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మె శనివారం 5వ రోజుకు చేరుకుంది. సిఐటియు, ఏఐటియుసి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దనాసి వెంకట్రామయ్య,
ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సాంబశివ, సిపిఐ జిల్లా నాయకులు నరసింహులు, అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

anganwadi strike 5th day lokesh 1
యువ గళం పాదయాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా మునగపాక మండల కేంద్రంలో అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపి, వారి నుండి వినతిపత్రం స్వీకరించిన నారా లోకేష్

pksm anganwadi strike 5th day
ప్రకాశం జిల్లాలో అంగన్వాడీల సమ్మె


చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండల కేంద్రంలో స్థానిక రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం వద్ద మూడు మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సమ్మెలో భాగంగా వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ…


నెల్లూరు జిల్లాలోని ఓ అంగన్వాడీ సెంటర్ ను ‘ఆడుదాం ఆంధ్ర’గా మార్చేసిన సచివాలయం సిబ్బంది


శ్రీకాకుళం జిల్లా పలాసలో అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు

nlr anganwadi strike 5th day

ఒళ్ళు బలిసి కాదు… కడుపు కాలి బయటకొచ్చాం
ఇందుకూరుపేట(నెల్లూరు) : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదో రోజు ఇందుకూరుపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులు పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. చాలీచాలని వేతనాలతో గొడ్డు చాకిరి చేస్తున్న అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని రోడ్డెక్కారన్న విషయం ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని అన్నారు. తెలంగాణ కన్నా జీతం పెంచి ఇస్తామన్న జగనన్న హామీని అమలు చేయకుండా దగా చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఈ ప్రభుత్వం దుర్మార్గమైన పద్ధతులను అవలంబిస్తోందని అన్నారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు అంటున్నట్లు అంగన్వాడీలు ఒళ్ళు బలిసి బయటకు రాలేదని, కడుపు కాలి బయటకు వచ్చారన్న విషయం విస్మరించిన ఈ ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల తాళాలు పగులగొట్టి సరుకులను దొంగతనంగా సచివాలయాలకు తరలించడం హేయమైన అని విమర్శించారు. అనంతరం ఇందుకూరుపేట MROకి వినతిపత్రం అందజేశారు.

skm anganwadi strike 5th day
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకి ఎమ్మెల్యే అశోక్ బాబు సంఘీభావం

manyam anganwadi strike 5th day


మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె


మన్యం జిల్లా పార్వతీపురంలో నల్లరిబ్బన్లతో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు

eg anganwadi strike 5th day
తూర్పు godavari జిల్లా నల్లజర్ల తాసిల్దార్ కార్యాలయం వద్ద ఒంటి కాలిపై నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలు

knl anganwadi strike 5th day
రోడ్లు వెంబడి అంగన్వాడీలు భిక్షాటన
కర్నూల్-ఆదోని: మా సమస్యలు న్యాయమైనవే పరిష్కరించకుండా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ప్రభుత్వానికి అంగన్వాడీలు అల్టిమేటమ్ జారీ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది రోజు రోజుకు వివిధ రూపాలలో అంగన్వాడీలు జనాల మద్దతు కూడగట్టుకుంటూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నారు. శనివారం ఆదోని పట్టణంలో దుకాణాల ముందు బిక్షటన చేస్తూ అంగన్వాడీలు నిరసన చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాచుటీ ఇవ్వాలని కోరుతున్న సీఎం జగన్ పట్టించుకోవడంలేదని యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వివిధ రూపాలలో నిరసన తెలియజేస్తామన్నారు. తమ పట్ల కనికరం చూపకుండా సెంటర్లను తాళాలు పగలగొట్టి ఓపెన్ చేయించడం సమంజసం కాదన్నారు. ఉద్యమాన్ని నేరగారించేందుకు ఎన్ని కుయుక్తులు చేసిన ముందుకు సాగుతాం అన్నారు మున్సిపల్ రోడ్ భీమస్ సర్కిల్, పి.యన్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా బిక్షటన జరిగింది. కార్యక్రమంలో నాయకురాలు వరలక్ష్మి జానకి శారద పద్మ తదితరులు ఉన్నారు.

akp anganwadi strike 5th day
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకరరావు
అనకాపల్లి జిల్లా కశింకోట : కశింకోటలో అంగన్వాడి కార్యకర్తలు 5 ఐదో రోజు సమ్మె శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా సిఐటీయు అధ్యక్షులు శంకరరావు ముఖ్యంగా అతిధిగా పాల్గొన్నారు. అంగన్వాడి కార్యకర్తలు న్యాయమైన కోరికలను పరిష్కరించాలన్నారు. 26000 పెంచాలని డిమాండ్ చేశారు. ముందుగా ఎమ్మెల్సీ బాబ్జి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కౌలు రై సంఘం జిల్లా కోశాధికారి తెళ్యియి బాబు జిల్లా సిఐటియు నాయకులు డి శ్రీనివాస రావు ఐద్వా జిల్లా నాయకురాలు డిడి వరలక్ష్మి ప్రాజెక్ట్ యూనియన్ నాయకులు తనుజ తనుజ వరలక్ష్మి వరలక్ష్మి కాసులమ్మ పాల్గొన్నారు. అంగన్వాడి కార్యకర్త సమ్మకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ కమిటీ సభ్యుడు కోటేశ్వరరావు న్యాయవాది శ్రీనివాసరావు కత్తిరి శ్రీధర్ పాల్గొన్నారు.

vzm anganwadi strike 5th day
విజయనగరం జిల్లా వంగర తహసీల్దార్ డి.ఐజాక్ కు వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీలు

జిల్లా ఆత్మకూరు కూడేరు


సమ్మెలో అనంతపురం జిల్లా ఆత్మకూరు కూడేరు ప్రాజెక్ట్స్ అంగన్వాడీలు

eluru anganwadi strike 5th day unguturu
ఏలూరు జిల్లా … రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చి త్రపటానికి అంగన్వాడి కార్యకర్తలు, సిఐటియు, వివిధ కార్మిక సంఘాల నాయకులు శనివారం ఉంగుటూరులో నివాళులు అర్పించారు. అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె శిబిరం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాబ్జి చేసిన పోరాట ఉద్యమాలను ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు వివరించారు. కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, కొర్ని అప్పారావు అంగన్వాడీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

manyam anganwadi strike 5th day
మన్యం జిల్లాలో ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జికి నివాళులర్పించిన అంగన్వాడీలు…

alluri anganwadi strike 5th day maredumilli
అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో అంగన్వాడీల బిక్షాటన…

alluri anganwadi strike 5th day addatigalaa
అల్లూరి జిల్లా అడ్డతీగల మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 5వ రోజు చేరింది. ఈరోజు మౌనవ్రతం పాటిస్తూ వినూత్న రీతిలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు దంగేటి సత్తిబాబు మద్దతు తెలిపారు. నాయకులకు పూలదండలు వేశారు.

alluri anganwadi strike 5th day
అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు కొనసాగిస్తున్న సమ్మె శనివారంతో ఐదో రోజుకు చేరింది. ఈరోజు ఉదయం మారేడుమిల్లి మండలంలోని అంగన్వాడీలు సమ్మె ప్రారంభానికి ముందుగా ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి మండలం అంగన్వాడి, మినీ అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

నిర్భంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు… అంటూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు

vsp anganwadi strike 5th day
విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా

ss anganwadi strike 5th day
అంగన్వాడీలను అణిచివేయాలని చూస్తే ప్రభుత్వానికి పతనము తప్పదు

ఆత్మకూరు మండల కేంద్రంలో అంగన్వాడీలు వంటావార్పు
సిఐటియు జిల్లాకార్యవర్గ సభ్యులు నాగేంద్ర కుమార్

సత్య సాయి జిల్లా-ఆత్మకూరు : అంగన్వాడి వర్కర్లు చేపట్టిన సమ్మెను అణిచివేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని సిఐటియు జిల్లా జనరల్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు.అంగన్వాడి వర్కర్స్,హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆత్మకూరు మండల కేంద్రాలలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగించారు.
తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో అంగన్వాడీలు సమస్యల సాధన కోసం వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్ష శిబిరం వద్దకు చేరుకొని సిఐటియు జిల్లా జనరల్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ 5 రోజులు పాటు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు విధులు నిర్వహించకపోతే రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం మానుకొని వారి న్యాయమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అణిచివేసేందుకు కుట్ర పడడం సమంజసం కాదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లను హెల్పర్లను భయాందోళన గురి చేసే విధంగా ఎంపీడీవో పంచాయతీ సెక్రటరీలు ఏపీఎంలు పోలీసులు సచివాలయ సిబ్బందితో అంగన్వాడి సెంటర్ల తాళాలను పగలగొట్టి నిరంకుశంగా పాలన సాగిస్తే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. మండల స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారులు వారికి కేటాయించిన పనులు చేయలేక సతమతమవుతుంటే కలెక్టర్లు ఒత్తిడితో అంగన్వాడి సెంటర్లను నిర్వహించాలని ఉద్యోగులను మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఇబ్బందులను సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని,గత ఆరు నెలల నుండి పెండింగ్లో పెట్టిన సెంటర్ అద్దెలు,టిఏ బిల్లులు తక్షణం చెల్లించాలని,ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి,రాజకీయ జోక్యాన్ని నివారించాలని,మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు,ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలనుండి జగన్ ప్రభుత్వం దూరం పెట్టిందని, జీతాలు చెల్లించేటప్పుడు మాత్రం మీకు ప్రభుత్వానికి సంబంధం లేదంటూ వ్యవహరిస్తుందని విమర్శించారు.పిల్లలకు,బాలింతలకు నాణ్యతలేని బాలామృతం,గుడ్లు,చిక్కీలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం మానేసి,విజిట్ల పేరుతో ఫుడ్ కమిషనర్,అధికారులు అంగన్వాడీలను వేధిస్తున్నారన్నారు.ఫేస్ రికగ్నైజేషన్ యాప్ (ఎఫ్.ఆర్.ఎస్) వచ్చాక అంగన్వాడీ సెంటర్లో పిల్లల పౌష్టికాహారం పని పక్కకుపోయి బాలింతలు చుట్టూ ఇళ్లకు, హాస్పిటల్స్ చుట్టూ అంగన్వాడీలు తిరగాల్సివస్తుందన్నారు.తక్షణ అన్ని యపులను కలిపి ఒకే యాప్ చేయాలన్నారు. 2017 నుండి టీఏ బిల్లులు చెల్లించికపోతే ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. ఆయాల ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయి ప్రభుత్వ నిబంధనల అమలుకోసం ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలియచేశారు.పక్కనున్న రాష్ట్రాలలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిన కర్ణాటక,తెలంగాణ ప్రభుత్వాలు అధికారాలు కోల్పోవాల్సిన పరిస్థితినీ గుర్తు చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని లేనిపక్షంలో రాజ్యాంగం కల్పించిన పోరాడే హక్కుద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హైద్వా మండల కార్యదర్శి రాజేశ్వరమ్మ మధ్యాహ్నం భోజనం జిల్లా కార్యదర్శి జయమ్మ అంగన్వాడి వర్కర్లు ఆయాలు పాల్గొన్నారు

atp anganwadi strike 5th day rayadurgam
అనంతపురం జిల్లా రాయదుర్గంలో అంగన్వాడి వర్కర్లు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలుపుతూ శిబిరంలో కూర్చున మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు

atp anganwadi strike 5th day battalapalli
అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో దగ్గర అంగన్వాడి వర్కర్స్ నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలతో


ఐదో రోజుకి చేరిన అంగన్వాడి వర్కర్ల నిర్వాధిక సమ్మెలో సీఐటియు అనంతపురం జిల్లా జనరల్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు.

wg anganwadi strike 5th day paderu
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న అంగన్వాడి సమ్మెలో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న అంగన్వాడీలు.

bapatla anganwadi strike 5th day
బాపట్లలో కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల 5వ రోజు సమ్మె

anganwadi strike 5th day lokesh

అనకాపల్లి జిల్లా మునగపాక మండల కేంద్రంలో జరుగుతున్న అంగన్వాడి ధర్నా శిబిరానికి టిడిపి నాయకులు లోకేష్ యువ గళం పాదయాత్రలో భాగంగా ధర్నా వద్దకు వచ్చి అంగన్వాడీలకు మద్దతు తెలియజేశారు. అంగన్వాడీల మధ్యలో కూర్చుని నిరసనలో పాల్గొన్నారు.

అంగన్వాడీల సమ్మె 5వ రోజులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అంగన్వాడీలు.

➡️