కోదండరాముని కల్యాణానికి అంకురార్పణ

Apr 16,2024 22:32 #Kodandarama Temple, #Vontimitta
  •  నేడు ధ్వజారోహణం

ప్రజాశక్తి-ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ధ్వజారోహణం కార్యక్రమం, సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు శేషవాహనంపై సీతారామలక్ష్మణులను ఊరేగించనున్నారు. అంకురార్పణ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఇఒలు నటేష్‌బాబు, ప్రశాంతి, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

➡️