‘నవ సందేహాల’ పేరుతో సిఎం జగన్‌కు-షర్మిల మరో లేఖ

అమరావతి : ‘నవ సందేహాల’ పేరుతో సిఎం జగన్‌కు ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల మరో లేఖ రాశారు. ” 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది ? ఏటా జనవరి 1 న జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు ? 25 ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. ఏం చేశారు ? గ్రూప్‌-2 కింద ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదెందుకు ? 23 వేలతో మెగా డీఎస్సీ అని 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు ? ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు ? ” అని షర్మిల లేఖలో ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

➡️