AP assembly: 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ఐదు రోజులపాటు జరగనున్నట్లు సమాచారం. తొలుత ఈ నెల 19 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అత్యధిక శాతం మంత్రులు నేటికీ బాధ్యతలు తీసుకోకపో వడం, గవర్నరు బక్రీద్‌ పండగ సెలవులో ఉండటంతో సమావేశాల తేదీని ప్రభుత్వం మార్చినట్లు తెలిసింది. ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 18న కేబినెట్‌ సమావేశం, 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అనివార్య పరిస్థితుల్లో సమావేశాల తేదీ మారడంతో ఈ నెల 22న కేబినెట్‌ సమావేశం జరిగే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. సమావేశాల తేదీ మార్పుపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

➡️