ఈనెల 12న ఎపి ఇంటర్‌ ఫలితాలు

Apr 10,2024 08:14 #12th, #AP Inter results, #this month

అమరావతి : ఎపి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తికానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

➡️