ఎపి సెట్‌ ఫలితాలు విడుదల

May 24,2024 21:01 #AP set, #Result Released

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఎపి సెట్‌ 2024 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎపిసెట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సెట్‌ మెంబర్‌ సెక్రటరీ ఆచార్య జిఎంజె.రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ…పరీక్షకు మెత్తం 30448 మంది హాజరవ్వగా 2444 మంది అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన విద్యార్థులు స్కోర్‌ కార్డ్‌ తదితర వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది.

➡️