అర్ధరాత్రి వేళలో.. ఉపాధ్యాయుల అరెస్టు

Jan 9,2024 11:31 #arrest, #midnight, #Teachers

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, ఉపాధ్యాయ అరెస్టుల ప్రజాస్వామ్యకమని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కుర్రామారావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం విజయవాడలో జరగనున్న ధర్నాకు వెళ్ళనీయకుండా చీరాల ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఉపాధ్యాయుల అరెస్టులను జన విజ్ఞాన వేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారు దాచుకున్న నగదను రూ.1896 కోట్లు వరకు ప్రభుత్వం బకాయి ఉందని వాటిని చెల్లించాలని కోరుతుంటే అర్ధరాత్రి వేళలో పోలీసులు ఇండ్లకు వెళ్ళి ఉపాధ్యాయులను అరెస్టు చేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రవీడి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన పిఆర్సి, డిఏ, సరెండర్‌ లీవులు, అరియర్లు, తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీతాలు 1వ తారీఖున విడుదల చేయాలి అని అన్నారు. సమాజంలో గౌరవప్రదమైన వఅత్తుల్లో ఉన్న ఉపాధ్యాయులను ఈ విధంగా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని చూడటం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. అందుకు ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో చీరాల టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అరెస్టు చేసిన పలువురు ఉపాధ్యాయ నేతలను ఈరోజు ఉదయం విడుదల చేశారు.

➡️