ఆశావర్కర్ల ‘చలో విజయవాడ’ – ముందస్తు అరెస్టులు

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … ఫిబ్రవరి 8న ‘చలో విజయవాడ’ చేపడుతున్నామని ఆశావర్కర్లు ప్రకటించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం, సెలవులు, వేతనంతో కూడిన మేటర్నిటీ లీవులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు, పనిభారం తగ్గించాలని, తదితర డిమాండ్స్‌ తో ఆశావర్కర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో… పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. ఆశావర్కర్ల నిరసనను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారు.

నిర్బంధం, అక్రమ అరెస్టులను ఆపాలి

విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లపై నిర్బంధం, అక్రమ అరెస్టులను ఆపాలి తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లాకార్యదర్శి సిహెచ్ రామ్మూర్తినాయుడు రాజాంలో జరిగిన అక్రమ అరెస్టులు ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు.

asha workers chalo vijayawada manyam a

నిర్బంధాలతో పోరాటాలు ఆగవు 

మన్యం జిల్లా : రాష్ట్రంలో ఆశా వర్కర్లు సిహెచ్డబ్ల్యులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రేపు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడానికి విజయవాడ వెళ్ళనవ్వకుండా అడ్డుకోవడం తగదని నిర్బంధాలతో పోరాటాలు ఆపలేరని ఏపీ ఆశా వర్కర్స్ మరియు సిహెచ్డబ్ల్యుల సంఘం ప్రభుత్వానికి తెలిపింది. బుధవారం సాలూరు మండలం సాలూరు పట్టణంలో ఆశా వర్కర్లను సిఐటియు నాయకులను గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడిగా తెలిపారు.  రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడే నాలుగున్నర సంవత్సరాలు గడిచిన సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
సమస్యలు పరిష్కరించినందుని పోరాటాలు జరుగుతున్నాయని సంక్షేమ పథకాలు గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఆ సంక్షేమ పథకాలు ఆశా వర్కర్లు కు అందుతున్నాయా లేదా తెలుసా అని ప్రశ్నించారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు పని ఎక్కువ జీతం తక్కువ అని అలాంటప్పుడు ప్రశ్నించే వారి గొంతు నొక్కే అర్హత ఈ ప్రభుత్వానికి లేదని తెలిపారు. న్యాయంగా పోరాడుతున్న వారిని పోలీసులు పెట్టి అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గొంతు నొక్కే కార్మికులు ఉద్యోగులు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు మామిడిపల్లి గ్రామంలో ఆశా వర్కర్ల సంఘం నాయకులు రాజేశ్వరి సాలూరులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడులను గృహ నిర్బంధం చేశారు.

అనకాపల్లి పోలీసు స్టేషన్ అదుపులో ఆశా వర్కర్లు

asha workers chalo vijayawada visakha

విశాఖ : గురువారం విజయవాడలో భారీ ధర్నాకు ఆశావర్కర్లు పిలుపు ఇవ్వడంతో పోలీసులు సంఘం నేతలపై, ఆశావర్కర్లను  నిర్భంధాలకు గురిచేస్తున్నారు.  విశాఖ సిఐటియు కార్యాలయం ముందు పోలీసు మోహరించారు. ఆశావర్కర్ల గౌరవాధ్యక్షురాలు మణికి కార్యాలయం దాటి వెళ్లకుండా నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్నాకు వెళ్లనివ్వకుండా పోలీసులు తమను అడ్డగిస్తున్నారని తెలిపారు. ధర్నాకు వెళ్లనివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వున్నవారిని కూడా అరెస్టు చేయడం అమానుషమన్నారు. సాయంత్రం లోపల ఆశావర్కర్లు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు స్వాధీనం చేయాలని భయపెడుతున్నారని తెలిపారు. జగన్ పాలనలో
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆగ్రహించారు. ఆశావర్కర్లకి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లను కోవిడ్ సమయంలో గ్లోబల్ హెల్త్ వర్కర్స్ గా ఐక్య రాజ్య సమితి గుర్తించిందని పేర్కొన్నారు. కానీ జగన్ ప్రభుత్వం కోవిడ్ సమయంలో పని చేసినందుకు ఆశావర్కర్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ఐద్వా నాయకురాలు పద్మ మాట్లాడుతూ…  ఆశావర్కర్లకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకూ అమలు చేయలేదని తెలిపారు. తమ సమస్యలు పట్టనట్లు వ్యవహరించడమే కాకుండా అరెస్టుకు చేయడం దుర్మార్గమన్నారు. మహిళలని చూడకుండా నిర్ధాక్షణ్యంగా వ్యవహరిస్తున్నారని ద్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని హెచ్చరించారు.

 

asha workers chalo vijayawada

కాకినాడ జిల్లా – సామర్లకోట : ఆశ వర్కర్స్ విజయవాడ ధర్నా గురువారం నేపద్యంలో బుధవారం తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి స్టేషన్ లో సుమారు 6గంటలు ఉంచి, 151 కేసు పెట్టి సంతకాలు తీసుకొని విడిచి పెట్టాడం, వీ కే రాయపురంలో ఆశ వర్కర్స్ అధ్యక్షులు గ్రేస్ ను గృహ నిర్భంధంలో ఉంచి, అక్రమ అరెస్టులను సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎన్. సురేష్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, టి నాగమణి, బాలం సత్తిబాబు, కరణం గోవిందరాజు తదితరులు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ధర్నాకు ఇక్కడ అరెస్టులు చేయడం ఎందుకు అని వారు ప్రశ్నించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని విమర్శించారు. మహిళల వద్దకు నలుగురు పురుష పోలీసులు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

 మహిళా సంఘా జిల్లా అధ్యక్షులు ఎస్ హైమవతి
మహిళా సంఘా జిల్లా అధ్యక్షులు ఎస్ హైమవతి

 

సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ
సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ

 

ఆర్ దేముడు నాయుడు సిఐటియు మండల కార్యదర్శి
ఆర్ దేముడు నాయుడు సిఐటియు మండల కార్యదర్శి

ప్రజాశక్తి – సామర్లకోట (కాకినాడ) : ఆశా వర్కర్ల చలో విజయవాడ నేపథ్యంలో … ముందస్తుగా పట్టణంలోని సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శులు బాలం శ్రీనివాసును బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి సామర్లకోట పోలీస్‌ స్టేషనుకు తరలించారు. దారపురెడ్డి క్రాంతి కుమార్‌ కు పెద్దాపురం పోలీసుల అర్థరాత్రి 12 గంటలకు హౌస్‌ అరెస్ట్‌ చేసి నోటీసులు ఇచ్చారు.

సిఐటియు అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు బొండా సన్నిబాబుని తెల్లవారుజామున 5 గంటల నుండి గృహనిర్బంధం చేసిన పోలీసులు....
సిఐటియు అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు బొండా సన్నిబాబుని తెల్లవారుజామున 5 గంటల నుండి గృహనిర్బంధం చేసిన పోలీసులు….
➡️