రుణాల మాఫీ కోసం కేంద్రాన్ని అడగండి

  • సిఎం చంద్రబాబుకు యనమల లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులను మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని టిడిపి ఎమ్మెల్సీ, ఆర్థికశాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. రుణాలు తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని, కాబట్టి మాఫీ తరువాత కూడా అప్పులు చేసుకునేందుకు ఆర్టికల్‌ 293 ప్రకారం అనుమతి కోరాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యనమల మంగళవారం లేఖ రాశారు. కేంద్రం అందించే సహాయాన్ని మరింత పెంచాలని కోరాలన్నారు. పన్నుల ఆదాయాలను క్రమబద్ధీకరించాలన్నారు. కేంద్రం అందించే వాటాను 41-42 శాతం కోరాలని సూచించారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు అర్హులైన వారికి మాత్రమే అందించాలన్నారు. ఆదాయాన్నిచ్చే సహజ వనరులను కాపాడుకోవాలని తెలిపారు. బిల్లుల చెల్లింపులు సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా మాత్రమే జరగాలని సూచించారు. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న అవినీతిని నిర్మూలించాలని కోరారు.

➡️