మంత్రి బుగ్గనపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు

May 14,2024 14:25 #atracity case, #minister buggana
  • 33 మంది అనుచరులపైనా…

ప్రజాశక్తి – బేతంచెర్ల (నంద్యాల) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 13న నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పిఎన్‌బాబు బేతంచెర్లలోని పోలింగ్‌ బూత్‌లను సందర్శించడానికి తన కారులో వెళ్తుండగా బుగ్గన తన అనుచరులతో కలిసి పిఎన్‌ బాబుపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. పిఎన్‌బాబు కారును ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై బాధితుడు బేతంచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి బుగ్గన, తన అనుచరులు 33 మందిపై ఎఫ్‌ఐ ఆర్‌ నం.109/2024 బ/ర 427 తీ/ష, 34 ఱజూష,3(1)( తీ) 3,(1), సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బేతంచెర్ల పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మాసూం బాష తెలిపారు.

➡️