సిరిసిల్లలో దారుణం – మహిళ గొంతుకోసి హత్య

Mar 9,2024 12:51 #Atrocity, #death, #sirisilla, #woman

రాజన్న సిరిసిల్ల (తెలంగాణ) : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వీర్నపల్లి మండలం వన్‌పల్లి గ్రామంలో నివాసముంటున్న మల్లవ్వ (45) ఇంట్లోకి శుక్రవారం రాత్రి దుండగులు ప్రవేశించారు. ఆమె గొంతుకోసి హత్య చేశారు. మహిళ ఇంటి చుట్టూ పెద్దగా ఇండ్లు లేకపోవడంతో దుండగుల పని సులవైంది. శనివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లవ్వ ఇంట్లో ఒంటరిగా ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️