భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదు : కేసీఆర్‌

Nov 21,2023 15:10 #KCR, #speech

తెలంగాణ: భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. నియోజకవర్గానికి చుట్టం చూపుతో వస్తారని మండిపడ్డారు. 20 మంది సీఎంలు కాంగ్రెస్‌ లో వున్నారని వ్యంగాస్త్రం వేశారు. గతంలో కంటే రెండు సీట్లు బీఆర్‌ఎస్‌ పెరుగుతుందన్నారు. 80 లక్షల కళ్ల అద్దాలు ప్రజల్లో మేము ఇచ్చినవి వుండేవన్నారు. కాంగ్రెస్‌ ఎలా గెలుస్తుంది? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌ తమకు విరోధి.. అయిన అభివృద్ధి మధిరలో చేశామన్నారు. భట్టి కాంగ్రెస్‌ అయినప్పటికీ పక్షపాతంగా వ్యవహరించలేదని తెలిపారు. తెలంగాణ దళిత బందు దేశానికి మార్గ దర్శకత్వం అని అన్నారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి చుట్టం చూపుతో వస్తారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరికీ ఒరిగేది లేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కరెంట్‌ లేదని అన్నారు. బోనకల్లో దళితులు దళిత బందు పెట్టమని అడిగారు అందువల్లనే ప్రకటించానని అన్నారు. మిగిలిన నియోజకవర్గం మొత్తం దళిత బందు ఇస్తానని అన్నారు.

➡️