బిఎస్‌పి అభ్యర్థికి గుండెపోటు

తెలంగాణ : బహుజన్‌ సమాజ్‌ పార్టీ అలీగఢ్‌ అభ్యర్థి గుఫ్రాన్‌ నూర్‌ గుండెపోటుకు గురై ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్‌ పేషెంట్‌ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసియులో చేర్చినట్లు గుఫ్రాన్‌ నూర్‌ కుమారుడు ఆదిల్‌ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్‌ నూర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్‌ అలీ.. గుఫ్రాన్‌ నూర్‌ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. బీఎస్పీ అలీగఢ్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్‌ నూర్‌ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్‌ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్‌ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు.

➡️