వైసిపి ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

May 19,2024 19:48 #MLA, #police case, #YCP

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాట ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కొందరు వైసిపి కార్యకర్తలను స్టేషన్‌కు పిలిచి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో వైసిపి కార్యకర్తను స్టేషన్‌ నుంచి రాచమల్లు బలవంతంగా తీసుకెళ్లారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

➡️