నేటి నుంచి కులగణన 

  • ఫిబ్రవరి 2 నాటికి ప్రక్రియ పూర్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం నుంచి కులగణనను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు, బడుగు బలహీన తరగతులకు సామాజిక న్యాయం కల్పించే లక్ష్యంతో కులగణ చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు.పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాల్లో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా ప్రతి ఇంటికీ వెళ్లి కులగణన చేయనున్నారు. ఈ నెల 28లోపు కులగణన ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఏ ఇళ్లు అయినా నమోదుకాకపోతే ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 2వ తేదీలోపు సచివాలయానికి వెళ్లి నమోదు చేయించుకునేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 726 కులాలు వున్నట్లు అంచనా. ఈ 726 కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్‌ (తేవర్‌), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్‌ కేటగిరిలో సేకరించనున్నారు.

➡️