చంద్రబాబు, పవన్‌ కలిసి నిరసన

  • భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయ ఉత్తర్వులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిసి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్నారు. ఈ నెల 14న రాజధాని అమరావతి ప్రాంతంలో ఇరువురు కలిసి కార్యక్రమం చేపట్టనున్నారు. వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను ఇరువురూ కలిసి భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయనున్నారు.

స్వర్ణ యుగానికి నాంది పలికేలా సంకల్పం : చంద్రబాబు

ఐదేళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలుకుతూ స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

➡️